Daily Archives: June 12, 2017

వృద్దాప్య పింఛన్‌ కోసం నిరాహార దీక్ష

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన తనకు వృద్దాప్య పింఛన్‌ ఇవ్వడం లేదంటూ ఓ వృద్దుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో సోమవారం నిరాహార దీక్ష ప్రారంభించాడు. దీక్షకు విశ్వబ్రాహ్మణ కామారెడ్డి జిల్లా సంఘం ప్రతినిధులు తమ సంఘీభావం తెలిపారు.పట్టణానికి చెందిన వడ్ల బాలయ్య (70) తనకు పింఛన్‌ ఇవ్వాలని, 6 సంవత్సరాలుగా కార్యాలయాల చుట్టు తిరిగి అలిసిపోయాడు. అన్ని అర్హతలున్నా తనకు పింఛన్‌ అందడం లేదంటూ ఆమరణ నిరాహారదీక్షకు దిగాడు. వెంటనే తనకు పింఛన్‌ …

Read More »

కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని కొనసాగిస్తామని ఆర్‌ఎస్‌పి నాయకులు అన్నారు. కామారెడ్డి ఇఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఆదివారం నుంచి ఆర్‌ఎస్‌పి జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నారు. సోమవారం సభల్లో పలు తీర్మానాలు చేశారు. బీడీ కార్మికులు సాధించుకున్న జీవో 41ని తక్షణమే అమలు చేయాలని, రైతు సమస్యలపై స్వామినాథన్‌ కమీషన్‌ సిఫార్సులను అమలు చేయాలని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరికి అందివ్వాలని, తదితర డిమాండ్లు …

Read More »

డయల్‌ యువర్‌ ఎస్‌పిలో 6 ఫిర్యాదులు

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం నిర్వహించిన డయల్‌ యువర్‌ ఎస్‌పి కార్యక్రమంలోప్రజల నుంచి ఆరు పిర్యాదులు అందినట్టు కామారెడ్డి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. కామారెడ్డి – 2, ఎల్లారెడ్డి- 2, బిక్కనూరు -1, బాన్సువాడ-1 ఫిర్యాదులు అందాయన్నారు. వెంటనే ఫిర్యాదులు పరిష్కరించాలని జిల్లా ఎస్‌పి శ్వేతారెడ్డి సంబంధిత ఎస్‌హెచ్‌వోలకు ఆదేశాలు జారీచేశారన్నారు.

Read More »

ఓసి విద్యార్థులకు అర్హత మార్కులు తగ్గించాలి

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓసి విద్యార్థులకు టెట్‌ పరీక్షలో అర్హత మార్కులు తగ్గించాలని ఓసి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్‌ పాపిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన టెట్‌ పరీక్షలో ఓసి విద్యార్థులకు 90 అర్హత మార్కులు ఉంచడం వల్ల ఎవరు ఉత్తీర్ణత సాధించలేకపోయారని, ప్రభుత్వం అర్హత మార్కుల నిబంధనను సడలించేలా చూడాలని కోరారు. అందరికి సమాన మార్కులు ఉండాలని, మార్కుల్లో వివక్ష ఉండకూడదని …

Read More »

విద్యావ్యాపారాన్ని అడ్డుకోవాలి

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో జరుగుతున్న విద్యావ్యాపారాన్ని అడ్డుకోవాలని తెలంగాణ నవనిర్మాణ్‌ విద్యార్థి సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీకాంత్‌ అన్నారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస నిబంధనలు పాటించకుండా ధనార్జనే ధ్యేయంగా అనేక ప్రయివేటు పాఠశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయన్నారు. అర్హతలేని అధ్యాపకులచే విద్యాబోధన చేయిస్తు వేల రూపాయల ఫీజులు దండుకుంటున్నారని ఆరోపించారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడం లేదని పేర్కొన్నారు. ఫీజుల వసూలుపై విద్యాశాఖాధికారులు దృస్టి సారించాలని, అనుమతులు లేని …

Read More »

ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలను ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ఆదర్శంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం బీర్కూర్‌ మండల కేంద్రంలో దత్తత తీసుకున్న ప్రాథమిక పాఠశాలను రూ. 7 లక్షలతో ఆధునీకరించగా మంత్రి ప్రారంభించారు. అనంతరం మహాత్మాజ్యోతిబా ఫూలే వెనకబడిన తరగతుల గురుకుల పాఠశాలను కెజి నుంచి పిజి విద్యలో భాగంగా ఈయేడు 5,6,7,8 తరగతులను ప్రారంభించారు. …

Read More »

పరిశ్రమల్లో మొక్కలు నాటేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి పరిశ్రమ స్థాపించిన స్థలంలో వాల్టా చట్టం ప్రకారం మూడవ వంతు స్థలాన్ని పచ్చదనానికి కేటాయించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం జిల్లాలోని పారిశ్రామిక వేత్తలతో పరిశ్రమల్లో హరితహారంపై సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయా పరిశ్రమల ప్రతినిదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎకరాకు 1400 చొప్పున మొక్కలు ప్రతి పరిశ్రమలో నాటేందుకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించిందన్నారు. మొక్కలను నాటి పర్యావరణ సమతుల్యాన్ని …

Read More »

ప్రజావాణిలో 87 ఫిర్యాదులు

  కామారెడ్డి, జూన్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 87 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులకు పంపి వాటిని పరిష్కరించాలని సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

వివాహితులకు దీర్ఘాయిష్షు!

రక్తపోటు, షుగర్‌ మరణాలు తక్కువ లండన్‌: ‘‘పెళ్లి చేసుకొని.. ఇల్లు చూసుకొని చల్లగ కాలం గడపాలోయ్‌..’’ అన్నారో సినీకవి! ఇల్లు మాటేమోకానీ.. వివా హం చేసుకున్నవాళ్లు పదికాలలపాటు చల్లగా ఉంటారని ఓ అధ్యయనం చెబుతోంది. బ్రహ్మచారులతో పోల్చితే.. పెళ్లయినవారికి కొవ్వు, రక్తపోటు, మధుమేహం వల్ల కలిగే మరణాలు గణనీయంగా తగ్గుతాయట. ఈ మేరకు ఆస్టన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. ‘‘గుండెపోటు వచ్చి, కోలుకున్నవారిలో పెళ్లైనవారే ఎక్కువగా ఉన్నారని మేం నిర్వహించిన ప్రాథమిక అధ్యయనంలో తేలింది’’ అని అధ్యయన బృందంలో భారత సంతతికి …

Read More »

‘బాత్రూంలో నీళ్లు తాగుతున్నా.. మీకు పుణ్యం ఉంటాది కాపాడండి సార్’

  నన్ను కాపాడి ఇండియాకు చేర్చండి సార్..: సౌదీలో తెలుగు మహిళ    దుబాయ్‌కి పంపుతామని చెప్పి ఏజెంట్ల చేతిలో మోసపోయి సౌదీలో బందీ అయిన ఓ అభాగ్యురాలి ధీనగాథ ఇది. ఆమె సౌదీ నుంచి ఫోన్‌లో ఆంధ్రజ్యోతితో తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె గోడు వింటే ఎవరికైనా కన్నీటి పర్యంతం కాక తప్పదు. ఆమె ధీనగాథ ఇలా… సౌదీ నుంచి ఫోన్‌లో హలో సార్‌, నమస్తే సార్‌, నా పేరు సుబ్బలక్ష్మి సార్‌. మాది మాధవరం-1, గ్రామం, సిద్ధవటం మండలం, కడప జిల్లా. …

Read More »