Daily Archives: June 13, 2017

నిరాహారదీక్షకు ప్రజా సంఘాల మద్దతు

  కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తనకు పింఛన్‌ ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేస్తు పట్టణంలోని నిజాంసాగర్‌ చౌరస్తాలో నిరాహారదీక్ష చేస్తున్న వడ్ల బాలయ్యకు ప్రజా సంఘాలు, టిడిపి నాయకులు తమ సంఘీభావం వ్యక్తం చేశారు. బాలయ్యను కలిసి ఆయనకు పూలమాలలువేసి ఆయన వెంట ఉంటామని పేర్కొన్నారు. 70 సంవత్సరాలు నిండిన బాలయ్యకు అధికారులు పింఛన్‌ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే అధికారులు బాలయ్యకు పింఛన్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు సుబాష్‌, …

Read More »

ఆర్డీవో కార్యాలయం ఎదుట బీడీ కార్మికుల ధర్నా

  కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట ది తెలంగాణ బీడీ రోలర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ వాణి నవవక్తి బీడీ కంపెనీ యాజమాన్యం కార్మికులకు వెయ్యి బీడీకి 800 గ్రాముల తూనికాకు ఇస్తుందని ఆరోపించారు. నెలసరి ఉద్యోగులతో ఆదివారాలు సైతం పనిచేయించుకొని శ్రమ దోపిడికి పాల్పడుతుందని పేర్కొన్నారు. పిఎఫ్‌ కట్టకుండా బీడీ …

Read More »

బీడీ పింఛన్ల పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గతంలో బీడీ పింఛన్లు పొందలేని అర్హులైన వారికి ఇటీవల సర్వే నిర్వహించి అర్హులను గుర్తించారు. ఇందులో పింఛన్లు మంజూరైన వారికి మంగళవారం దేవునిపల్లి సర్పంచ్‌ నిట్టు వెంకట్రావ్‌, ఉపసర్పంచ్‌ రాజేందర్‌తోపాటు వార్డు మెంబర్లు పింఛన్లు అందజేశారు. అర్హులైన చాలా మందికి పింఛన్లు రాకపోవడంతో తిరిగి సర్వే చేపట్టి అర్హులైన వారందరికి పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు.

Read More »

కామారెడ్డిలో లఘుచిత్రం చిత్రీకరణ

  కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని అఖిల ఆసుపత్రిలో మంగళవారం లఘుచిత్రం సంబంధించి చిత్రీకరణ చేపట్టారు. అఖిల చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్యుడు పుట్ట మల్లికార్జున్‌ లఘుచిత్రం నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌ నరేశ్‌, కెమెరామెన్‌ బద్రిలు ఆసుపత్రిలో పలు సన్నివేశాలు చిత్రీకరించారు. నటులు ఫణిగౌడ్‌, వినోద్‌కుమార్‌, మేఘన, క్రాంతి, భాస్కర్‌, అశ్వితలతో పాటు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ లింగం, కాస్టూమ్‌ మేకప్‌ మెన్‌ బాబిలు చిత్రీకరణలో పాల్గొన్నారు. వైద్యులు మల్లికార్జున్‌ చిత్రాన్ని నిర్మించడంతోపాటు అందులో నటిస్తున్నారు.

Read More »

ప్రభుత్వ, ప్రయివేటు స్థలాల్లో విరివిగా మొక్కలు నాటాలి

  కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ స్థలాలతో పాటు ప్రయివేటు సంస్థలకు అప్పగించిన స్థలాల్లో విరివిగా మొక్కలునాటి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ సంబంధిత సంస్థలకు తెలంగాణ హరితహారంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ వారితో మాట్లాడుతూ రైస్‌మిల్లర్లు, ఎల్‌పిజి డీలర్లు, పెట్రోల్‌ బంక్‌, చౌకధరల దుకాణదారులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చూడాలని …

Read More »

కృష్ణమందిరానికి రెండున్నర లక్షల గ్రాంట్‌

  కామారెడ్డి, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో 44వ జాతీయరహదారి పక్కనగల కృష్ణమందిరం బ్రహ్మజ్ఞాన ఆశ్రమానికి తనవంతుగా రూ. 2.50 లక్షలు గ్రాంట్‌ అందజేస్తున్నట్టు శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ తెలిపారు. శ్రీకృష్ణ మందిరంలో నిర్వహిస్తున్న లక్ష్మిగణపతి మహాయాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ రూ. 2.50 లక్షలు ఇచ్చి గ్రాంట్‌ ద్వారా పదిన్నర లక్షలు …

Read More »

మోడి నిర్ణయాలతో ప్రజలు పరేషాన్‌

  నందిపేట, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధాని నరేంద్రమోడి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో పాత నోట్ల చలామణి రద్దుచేయడమే గాకుండా బ్యాంకుల్లో డబ్బు లేకుండా చేయడంతో ప్రజలు పరేషాన్‌ అవుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ ఆరోపించారు. ఖరీఫ్‌ సీజన్‌ వచ్చి వర్సాలు కురియడంతో విత్తనాలు నాటేందుకు రైతు చేతుల్లో డబ్బు లేకుండా చేసిన ఘనత మోడికే దక్కుతుందన్నారు. నోట్ల రద్దుప్రభావంతో బ్యాంకుల్లో, ఎటిఎంలలో డబ్బులేక రైతులకు అప్పులు కూడా దొరకడం లేదన్నారు. దీంతో విత్తనాలు, …

Read More »

రోడ్ల నీరు ఇంటిలోకి…

  నందిపేట, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో మంగళవారం పగటి పూట రెండు గంటల పాటు భారీగా వాన కురియడంతో రోడ్లపై ఉన్న గుంతల్లో నీరు నిలిచిపోయింది. దీంతో ఎక్కడికక్కడ చెరువులను తలపించాయి. జామె మసీద్‌ సమీపంలోని రాజ్‌హోటల్‌ వద్దగల ఇళ్లలోకి నీరు వచ్చింది. గతంలో హోటల్‌ ముందు కల్వర్టుపైపు పగిలి గుంత ఏర్పడడంతో అధికారులు తాత్కాలికంగా మొరం వేసి మరమ్మతు చేపట్టారు. దాంతో కల్వర్టు నిండిపోయి డ్రైనేజీల నీరు బయటకు వచ్చి రోడ్డుమీదుగా ప్రవహించి …

Read More »

పొలం పనుల్లో రైతులు బిజీ

  నందిపేట, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని రైతులు పొలం పనుల్లో బిజీగా ఉన్నారు. గత వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు పొలం బాటపట్టారు. ఖరీఫ్‌ సీజన్‌లో 14,694 హెక్టార్లలో పంటసాగు చేయనున్నారు. ఇందులో 6 వేల హెక్టార్ల వరి, 4500 హెకార్ట సోయా, 1500 హెక్టార్ల పసుపు, 2500 హెక్టార్లలో మొక్కజొన్న, ఇతర పంటలు సాగుచేసేందుకు సుమారు 13 వేల మంది రైతులు పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలోని డొంకేశ్వర్‌, ఖుదావన్‌పూర్‌, చింరాజ్‌పల్లి, ఐలాపూర్‌ పిఏసిఎస్‌ సొసైటీల్లో ముందస్తు …

Read More »

మాడల్‌ స్కూల్లో ప్రవేశాలు

  నందిపేట, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట పలుగుట్ట వద్దగల తెలంగాణ మాడల్‌ స్కూల్లో 6వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలు జరుగుతున్నాయని ప్రిన్సిపాల్‌ ఫెరోజ్‌ హైదర్‌ తెలిపారు. స్థానిక మాడల్‌ స్కూల్లో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ 6వ తరగతి కొరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకొని అర్హత పరీక్ష రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థులు వారంరోజుల్లో పాఠశాలకు వచ్చి ప్రవేశం పొందాలని సూచించారు. లేనియెడల వారి స్తానంలో మెరిట్‌ ప్రకారం ఇతరులకు ప్రవేశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. …

Read More »