Daily Archives: June 15, 2017

నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండేనా

  నిజాంసాగర్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయం ప్రస్తుతం నీరులేక అడుగంటిపోయింది. మృగశిరకార్తె ప్రారంభం కావడంతో రైతులు వర్షం కోసం వరుణుని కృప కోసం ఎదురుచూస్తున్నారు. ఆకాశంలో మబ్బులవైపు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో అయినా సకాలంలో వర్షాలు కురిసి నిజాంసాగర్‌ ప్రాజెక్టు నిండితే అనకున్న స్థాయిలో పంటలు సాగయ్యే అవకాశముందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మృగశిరకార్తె ప్రారంభమైనప్పటినుంచి కురిసిన చిరుజల్లులకు వాతావరణం చల్లబడింది. భారీ వర్షాలు ఇప్పటి వరకు కురవక పోవడంతో …

Read More »

అనుమతులులేని వాటర్‌ప్లాంట్‌లపై చర్యలు

  కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా భూగర్భ జలాలు వాడుకుంటున్న మినరల్‌ వాటర్‌ప్లాంట్లపై చర్యలు తప్పవని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ఒక ప్రకటనలో హెచ్చరించారు. నీటికొరకు 400 అడుగులకు పైగా బోరుబావులు తవ్వితే వాల్టా చట్టం ప్రకారం వారిపై చర్యలు తప్పవని పేర్కొన్నారు. అలాంటి బోరుబావులుంటే వాటిని స్వతహాగా మూసివేయాలని, మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల యజమానులకు హెచ్చరించారు.

Read More »

అంగన్‌వాడి బడిబాట

  కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కేంద్రంలోని 8వ వార్డు రాజీవ్‌నగర్‌ అంగన్‌వాడి కేంద్రంలో గురువారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. అంగన్‌వాడి టీచర్లు, విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఇంటింటికి తిరిగి అంగన్‌వాడి కేంద్రాల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు. పిల్లలను అంగన్‌వాడిల్లో చేర్చాలని కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్‌ సుజాత, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు రమేశ్‌గౌడ్‌, సుధ, తదితరులు పాల్గొన్నారు.

Read More »

అతిథి అధ్యాపకుల వేతనం పెంచాలని ఎంపికి వినతి

  కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల గౌరవ వేతనాన్ని పెంపొందించాలని నిజామాబాద్‌ జిల్లా ఎంపి కల్వకుంట్ల కవితకు అతిథి అధ్యాపకులు వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్‌ వెళ్తున్న ఆమెను కలుసుకొని వినతి పత్రం ఇచ్చి సమస్యలు విన్నవించారు. రాష్ట్రంలో 800 లకుపైగా డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారన్నారు. రెగ్యులర్‌, కాంట్రాక్టు వారితో సమానంగా విదులు నిర్వహిస్తున్నా కనీస వేతనాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనం …

Read More »

ప్రేమను పెంచుకొని బంధాలు నిలుపుకోవాలి

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రేమను పెంచుకొని బంధాలు నిలుపుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం ప్రపంచ వృద్దుల వేధింపుల నివారణ అవగాహన దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘ భవనంలో జరిగిన కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మనం భూమిపైకి వచ్చినపుడు ఒకరమే వస్తామని, బంధం కన్నా, ప్రేమని పెంచుకొని కలిసికట్టుగా జీవించాలన్నారు. ఆధ్యాత్మికత లోపించడం వల్ల మానసిక రుగ్మతలకు గురవుతున్నారని, ఆధ్యాత్మికతను …

Read More »

కామారెడ్డిలో సర్కస్‌ అదుర్స్‌…

  కామారెడ్డి, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో జమున సర్కస్‌ అదుర్స్‌ అనిపిస్తుంది. రకరకాల విన్యాసాలతో చూపరులను అబ్బుర పరుస్తోంది. ప్రమాదకరమైన విన్యాసాలు, ఒళ్ళు గగుర్పొడిచేల ఉన్నాయి. 1901లో సర్దార్‌ గురుదీప్‌ సింగ్‌ జమున సర్కస్‌ స్థాపించారు. ప్రస్తుతం సంస్థకు చరణ్‌దీప్‌ సింగ్‌ ఎండిగా వ్యవహరిస్తున్నారు. భారతదేశంతోపాటు రష్యా, ఆఫ్రికన్‌, మణిపూర్‌, మంగోలియా, చైనాకు చెందిన కళాకారులు తమ విన్యాసాలతో అలరిస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని కొత్తబస్టాండ్‌ సమీపంలో సిఎస్‌ఐ మైదానంలో జమున సర్కస్‌ నడుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు, …

Read More »