Daily Archives: June 16, 2017

బోరుమోటారు ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 7వ వార్డు రాజానగర్‌ కాలనీలో శుక్రవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ బోరుమోటారు పనులు ప్రారంభించారు. నాన్‌ప్లాన్‌ గ్రాంట్‌ రూ. లక్షతో పనులుచేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ బట్టు మోహన్‌, ఏ.ఇ జగన్నాథం తదితరులున్నారు.

Read More »

జూనియర్‌ కళాశాలలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

  కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమస్యలకు నిలయంగా మారిందని పేర్కొంటూ తెలంగాణ నవనిర్మాణ్‌ విద్యార్థి సేన ప్రతినిదులు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సేన జిల్లా అధ్యక్షుడు వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ కళాశాలలకు వెళ్లే దారి దెబ్బతిని గుంతల మయంగా మారిందన్నారు. కళాశాలలో కనీస వసతులు లేవని, కాంపౌండ్‌ వాల్‌, మంచినీటి సౌకర్యం కూడా సరిగా లేవని పేర్కొన్నారు. మౌలిక వసతులు కల్పించాలని, సమస్యల పరిష్కారానికి చర్యలు …

Read More »

ముస్లింలకు ఇఫ్తార్‌ విందు

  కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వెస్ట్రన్‌ యూనియన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ కామారెడ్డి జిల్లా బ్రాంచ్‌ ఆధ్వర్యంలో గురువారంరాత్రి కామారెడ్డి, భిక్కనూరు మండల కేంద్రంలో రంజాన్‌ పురస్కరించుకొని మైనార్టీలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసినట్టు బ్రాంచ్‌ మేనేజర్‌ రమేశ్‌గౌడ్‌ తెలిపారు. దీనికి తెలుగు రాష్ట్రాల మేనేజర్‌ ఎం.సూరజ్‌ కుమార్‌, ఏరియా మేనేజర్‌ విజయ భాస్కర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా మేనేజర్‌ రాజేందర్‌, తెలంగాణ అడ్మిన్‌ రాజేశ్‌కుమార్‌లు పాల్గొన్నారు. హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి జీవించే సంప్రదాయం తెలంగాణలో ఉందని, రంజాన్‌ను …

Read More »

పార్లమెంట్‌ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన రాజంపేట వాసి

  కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత పార్లమెంటు లోక్‌సభ సచివాలయం నిర్వహించే ఇంటర్న్‌షిప్‌-2017 ప్రోగ్రామ్‌కు కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రానికి చెందిన కాసం పృథ్వీరాజ్‌ ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థుల్లో 25 మందిని ఎంపిక చేసి ప్రతియేటా ఇంటర్న్‌షిప్‌కు అవకాశం కల్పించారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల నుంచి పృథ్వీరాజ్‌ ఎంపికైన ఏకైక వ్యక్తి అని ఆయన తండ్రి కాసం సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈనెల 28 నుంచి వచ్చేనెల 27 వరకు పార్లమెంటులో జరిగే …

Read More »

ఉపముఖ్యమంత్రికి ఘన స్వాగతం

  కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీకి తెరాస నాయకులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్‌ నుంచి బోధన్‌లో కార్యక్రమానికి పాల్గొనేందుకు వెళుతున్న ఆయన్ను మార్గమధ్యలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఇటీవల తెరాస రాష్ట్ర మైనార్టీ సెల్‌ అధ్యక్షునిగా ఎన్నికైన ముజీబుద్దీన్‌ను ఉపముఖ్యమంత్రి అభినందించారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, తెరాస నాయకులు ఉన్నారు.

Read More »

గురుకుల పాఠశాలలో ప్రవేశానికి కౌన్సిలింగ్‌

  గాంధారి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశానికి రెండవ విడత కౌన్సిలింగ్‌ ఈనెల 18న నిర్వహిస్తున్నట్టు ఉమ్మడి జిల్లాల సమన్వయ అధికారి శ్యామలాదేవి తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, బాన్సువాడ, నాగిరెడ్డిపేట్‌, నిజామాబాద్‌ జిల్లాలోని చీమన్‌పల్లి పాఠశాలల్లో ప్రవేశానికి గాంధారి గిరిజన గురుకుల పాఠశాలలో కౌన్సిలింగ్‌ ఉంటుందన్నారు. అదేవిధంగా ఎల్లారెడ్డి, ఇందల్వాయి పాఠశాలల్లో ప్రవేశానికి గాంధారి గురుకుల కళాశాలలో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 18న ఉదయం 9 గంటలకు విద్యార్థులు …

Read More »

ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య

  – రాష్ట్ర విద్యాశాఖ అదనపు డైరెక్టర్‌ రాధారెడ్డి గాంధారి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు ఉన్నత విద్య లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ అదనపు డైరెక్టర్‌ రాధారెడ్డి అన్నారు. శుక్రవారం గాంధారి మండలంలోని జువ్వాడి ప్రభుత్వ పాఠశాల పరిశీలించారు. అదేవిధంగా మండలంలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లోని విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాల గురించి పరీక్షించారు. ప్రయివేటు పాఠశాలల కంటే ప్రభుత్వ …

Read More »

రోడ్లపై నాట్లువేసి వినూత్న నిరసన

  గాంధారి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చిన్నపాటి వర్షానికే రోడ్లపై బురద నిలవడంతో దానిలో వరినాట్లు వేసి బిజెపి నాయకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. గాంధారి మండల కేంద్రంలోని ప్రధాన రోడ్డుపై నిలిచిన బురదలో స్థానిక బిజెపి నాయకులు వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా శుక్రవారం బిజెపి నాయకులు రోడ్డుపై వినూత్నంగా నిరసన తెలిపారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యే వరకు …

Read More »