Breaking News

వెంకన్న ఆలయంలో మహాఅన్నదానం

 

బీర్కూర్‌, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో శనివారం పలువురు దాతల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శనివారం వెంకటేశ్వరుని ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం నుంచే ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం దాతల విరాళాలతో మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలకు ఆలయ కమిటీ తరఫున సన్మానించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

Check Also

అక్టోబరు 2 నాటికి జిల్లాను స్వచ్చజిల్లాగా ప్రకటించేలా చర్యలు

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబరు 2వ తేదీ నాటికి జిల్లాను బహిరంగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *