ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య

బీర్కూర్‌, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ విద్య అందించబడుతుందని బీర్కూర్‌ గ్రామ సర్పంచ్‌ దూలిగె నర్సయ్య అన్నారు. అధిక ఫీజులు చెల్లించి ప్రయివేటు పాఠశాలలో చదివించడం కన్న, నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలో విద్యబోధన ఉత్తమంగా ఉంటుందని ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో భోజనం, ఉత్తమ విద్య, పుస్తకాలు, దుస్తులు అందించబడుతుందని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలకు మొగ్గుచూపాలని ఆయనఅన్నారు. కార్యక్రమంలో పిఆర్‌టియు మండల అధ్యక్షుడు గుండ నర్సింలు, ఎంఇవో గోపాల్‌రావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *