చెత్త బుట్టల పంపిణీ

 

కామారెడ్డి, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 8వ వార్డు రాజీవ్‌నగర్‌ కాలనీలో శనివారం ఆర్డీఓ శ్రీనివాస్‌, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ఆధ్వర్యంలో చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెత్తను బహిరంగంగా వేయకుండా చెత్తబుట్టలోనే వేసి వాటిని మునిసిపల్‌ చెత్తబండ్ల ద్వారా తరలించాలన్నారు. పరిశుభ్రత పాటించి ఆరోగ్యాన్ని సరంక్షించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ యాదమ్మ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Check Also

పరోపకారం చేయడం చెట్లనుంచి నేర్చుకోవాలి

  కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏమి ఆశించకుండా పరోపకారం చేయడం అనేది చెట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *