Breaking News

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

 

కామారెడ్డి, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్‌ పే ఇచ్చి ప్రభుత్వం వేతనం పెంచడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ జూనియర్‌ కలాశాల దోమకొండలో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల బృందం ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ నిర్వహించారు. అనంతరం అనాధాశ్రమానికి వెళ్లి పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఇచ్చిన హామీ ప్రకారం రూ. 37,100 బేసిక్‌పే ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంత్‌ లెక్చరర్లు వసంత్‌, వైద్య శేషారావు, భానుప్రకాశ్‌, శ్రీనివాస్‌, రజిత,తదితరులు పాల్గొన్నారు.

Check Also

వయోవృద్దుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

  కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వయోవృద్దుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందుకోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *