Breaking News

పాఠశాలల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

 

కామారెడ్డి, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని, వారికి చిత్తశుద్ది లేదని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలిమెల భానుప్రసాద్‌ విమర్శించారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల సర్వే కార్యక్రమం నిర్వహించారు. పెద్దబజార్‌, జడ్పిహెచ్‌ఎస్‌ బాలికల, జెబిఎస్‌ పాఠశాలల్లో సర్వే చేశారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో కనీసం తాగునీరు, బల్లాలు, తలుపులు సైతం లేవని, ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనమన్నారు. ఉపాధ్యాయుల పనితీరు సైతం సరిగా లేదని విమర్శించారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ప్రవీణ్‌, నరేశ్‌, భరత్‌, సాయి, భవిత, నిఖిత, తదితరులు పాల్గొన్నారు.

Check Also

అక్టోబరు 2 నాటికి జిల్లాను స్వచ్చజిల్లాగా ప్రకటించేలా చర్యలు

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబరు 2వ తేదీ నాటికి జిల్లాను బహిరంగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *