మైనార్టీలకు ఇఫ్తార్‌ విందు

 

బీర్కూర్‌, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దుర్కి గ్రామంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు మల్యాద్రి మైనార్టీలకు శనివారం సాయంత్రం ఇఫ్తార్‌ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్‌మాసంలో ఉపవాసదీక్షలు కఠినంగా నిర్వహిస్తారని అన్నారు. రంజాన్‌ పవిత్ర మాసమని అన్నారు. విందులో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కిషోర్‌ యాదవ్‌, మాజీ గ్రంథాలయ ఛైర్మన్‌ దివిటి శ్రీనివాస్‌ యాదవ్‌, యువజన కాంగ్రెస్‌ బాన్సువాడ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ హైమద్‌, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Check Also

పది అడుగుల నుంచి పాతాళంలోకి

 ఆశలను నీరుగార్చిన రెండు తప్పిదాలు తల్లితండ్రులు, గ్రామస్థుల పొరపాటుతో 40 అడుగుల లోతుకు మోటర్‌ బలవంతంగా లాగాక కనిపించకుండా పోయిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *