Breaking News

సినారె సాహితీ సేవలు మరువలేనివి

 

కామారెడ్డి, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సాహితీ లోకానికి చేసిన సేవలు మరువలేనివని కామారెడ్డి జిల్లా రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు నాగర్తి చందారెడ్డి అన్నారు. శనివారం డాక్టర్‌ సి.నారాయణరెడ్డి సంతాపసభను ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ సినారె సినిమాల్లో అనేక పాటలు రాయడంతోపాటు సాహితీ లోకానికి అనేక సేవలందించారన్నారు. జ్ఞానపీఠ్‌, పద్మవిభూషణ్‌తో పాటు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారని కొనియాడారు. కార్యక్రమంలో సంఘం గౌరవ సలహాదారుడు ఎడ్ల రాజిరెడ్డి, ప్రతినిధులు రమేశ్‌రెడ్డి, రాంరెడ్డి, హన్మంత్‌రెడ్డి, మల్లారెడ్డి, సంజీవరెడ్డి, సుధాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

అక్టోబరు 2 నాటికి జిల్లాను స్వచ్చజిల్లాగా ప్రకటించేలా చర్యలు

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబరు 2వ తేదీ నాటికి జిల్లాను బహిరంగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *