వెంచర్లలో మొక్కలు నాటాలి

 

కామారెడ్డి, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొక్కలు నాటాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ కార్యాలయంలో రియల్‌ ఎస్టేట్‌ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంచర్లలో విరివిగా మొక్కలు నాటాలని నిర్దేశించిన స్థలంలో చట్టప్రకారం మొక్కలు నాటి వెంచర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిటిపివో జలందర్‌, జిల్లా భూగర్భ శాఖాధికారి శ్రీనివాస్‌బాబు, డిపివో రాములు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పది అడుగుల నుంచి పాతాళంలోకి

 ఆశలను నీరుగార్చిన రెండు తప్పిదాలు తల్లితండ్రులు, గ్రామస్థుల పొరపాటుతో 40 అడుగుల లోతుకు మోటర్‌ బలవంతంగా లాగాక కనిపించకుండా పోయిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *