Breaking News

అంగన్‌వాడిలో విద్యార్థులకు పౌష్టికాహారం

 

బీర్కూర్‌, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐదు సంవత్సరాల్లోపు చిన్నారులను అంగన్‌వాడి కేంద్రాలకు పంపించడం ద్వారా వారికి పౌష్టికాహరం అందించడం జరుగుతుందని అంగన్‌వాడి సూపర్‌వైజర్‌ వాణి అన్నారు. నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో చిన్నారులను అంగన్‌వాడిలో చేర్పించేందుకు ప్రధాన వీదుల గుండా అంగన్‌వాడి సౌకర్యాలను వివరిస్తు ర్యాలీ నిర్వహించారు. అంగన్‌వాడిలో చిన్నారులకు ప్రతిరోజు కోడిగుడ్లు, బాలింతలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని, అంగన్‌వాడిలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఎంపిటిసి మల్లేశ్‌, గ్రామ సర్పంచ్‌ అరిగె సాయిలు, అంగన్‌వాడి కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

అక్టోబరు 2 నాటికి జిల్లాను స్వచ్చజిల్లాగా ప్రకటించేలా చర్యలు

  కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబరు 2వ తేదీ నాటికి జిల్లాను బహిరంగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *