రైతులకు లబ్దిజరిగేలా అవగాహన కల్పించాలి

 

కామారెడ్డి, జూన్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని రైతులకు లాగుబడి కింద చెల్లించే రూ. 4 వేలు మొత్తం గురించి జిల్లాలోని రైతులందరికి విషయాన్ని విశదీకరించి వారియొక్క బ్యాంకు ఖాతా వివరాలు ఆధార్‌ కార్డు భూమియొక్క విస్తీర్ణము, సర్వే నెంబర్ల వివరాలు అన్ని కూడా వెంటనే నమోదు చేసుకోవాలని చెప్పాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం సంయుక్త కలెక్టర్‌, ఆర్డీవో, ఎల్లారెడ్డి, బాన్సువాడ జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌అగ్రికల్చర్‌, జిల్లాలోని అగ్రికల్చర్‌ అధికారులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. వారంరోజుల్లో ఈకార్యక్రమం సంపూర్ణంగా, విజయవంతంగా అమలు చేయడానికి అధికారులు పనిచేయాల్సిన అవసరముందన్నారు. రైతులు ప్రైవేటుగా ఎక్కువ వడ్డిరేటుకి వడ్డికి తీసుకొని సాగుబడి చేయడం వల్ల అప్పులు పెరిగి ఆత్మహత్యలకు దారి తీస్తుందని, అప్పులు చేయకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య, అధికారులు శ్రీను, దేవేందర్‌, రాజేశ్వర్‌, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Check Also

పది అడుగుల నుంచి పాతాళంలోకి

 ఆశలను నీరుగార్చిన రెండు తప్పిదాలు తల్లితండ్రులు, గ్రామస్థుల పొరపాటుతో 40 అడుగుల లోతుకు మోటర్‌ బలవంతంగా లాగాక కనిపించకుండా పోయిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *