పేద ముస్లింలకు వంట సామగ్రి పంపిణీ

 

నందిపేట, జూన్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కొండూరు, తల్వేద, దేవిపట్నం, బాద్గుణ, కోమట్‌పల్లి గ్రామాల్లోని నిరుపేద ముస్లింలకు రంజాన్‌ సందర్భంగా ఆదివారం జమాతె ఇస్లామి హింద్‌, హ్యూమన్‌ వెల్పేర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వంట సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్‌ షేక్‌గౌస్‌ మాట్లాడుతూ జమాతె ఇస్లామి హింద్‌ దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి పేదలను ఆదుకుంటుందన్నారు. అలాగే జమాతె ఇస్లామి నందిపేట శాఖ ఆద్వర్యంలో గత ఏడేళ్ళుగా పేదలకు రంజాన్‌ మాసంలో వంటసామగ్రి పంపిణీ, చలికాలంలో రగ్గులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ధనిక ముస్లింలు తమ సంపద నుండి 2.5 శాతం జకాత్‌ రూపంలో తీసి ఖర్చు చేస్తుంటారని, అలాగే జమాతె ఇస్లామి సభ్యులు, దాతల జకాత్‌ రూపాయలతో సామగ్రి తెచ్చి పంచుతున్నామన్నారు. గత మూడురోజుల నుండి వివిధ గ్రామాల్లో సరుకులు పంపిణీ చేశామని, సోమవారం మరికొన్ని గ్రామాల్లో సరుకులు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కొండూరు లిఫ్టు ఛైర్మన్‌ రాజు, ఇలియాస్‌, జమాతె ఇస్లామి సభ్యులు ఉమార్‌, ఫారూఖ్‌, బిలాల్‌, ఉస్మాన్‌, సలీం తదితరులున్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *