రంజాన్‌ సందర్భంగా నోటుపుస్తకాల పంపిణీ

 

కామారెడ్డి, జూన్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని భారత్‌రోడ్డులో ఆదివారం రంజాన్‌ సందర్భంగా డాక్టర్‌ మహమ్మద్‌ మునీరోద్దీన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే ధ్యేయంతో విద్యార్థులకు నోటుపుస్తకాలు, ఆటవస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, తెరాస నాయకులు వేదశ్రీ, లతారెడ్డి, కాలనీ వాసులు విజయ, వనజ, లక్ష్మి, నాగమణి, సునీత, పద్మ, ఇలియాస్‌, వినయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పది అడుగుల నుంచి పాతాళంలోకి

 ఆశలను నీరుగార్చిన రెండు తప్పిదాలు తల్లితండ్రులు, గ్రామస్థుల పొరపాటుతో 40 అడుగుల లోతుకు మోటర్‌ బలవంతంగా లాగాక కనిపించకుండా పోయిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *