Breaking News

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు కావలెను

 

కామారెడ్డి, జూన్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామకం చేయటానికి జిల్లాలో శిక్షణ పొంది, టెట్‌ పరీక్ష ఉత్తీర్ణులైన ఉపాధ్యాయ ఉద్యోగం చేయడానికి ఇష్టపడే అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా గిరిజన అభివృద్ది అధికారి గంగాధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వారి దరఖాస్తులను, బయోడేటా ఫారం, అర్హత పత్రాల జిరాక్సు కాపీలు జతచేసి గిరిజన అభివృద్ది కార్యాలయంలో అందజేయాలని కోరారు. దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి విదుల్లో నియమించడానికి నిర్ణయిస్తామని పేర్కొన్నారు. అధిక విద్యార్హతలు, టెట్‌ మార్కుల శాతం ఆధారంగా అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *