Breaking News

Daily Archives: June 19, 2017

సార్లు… మీ దారి బాగుచేసుకోరూ…

  కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సార్లు మీ కార్యాలయానికి వెళ్లే దారిని బాగుచేసుకోరూ అంటూ కామరెడ్డి బల్దియా కార్యాలయానికి వచ్చే ప్రజలు కోరుతున్నారు. బల్దియా ప్రాంగణం మొత్తం బురదమయం కావడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఇబ్బందిగా మారింది. ప్రాంగణమంత చిత్తడిగా ఉండడంతో కాలు పెట్టి తీసే పరిస్థితి లేదు. దీన్ని రోజూ చూస్తూ ఆ దారి గుండా వెళుతున్న ప్రజాప్రతినిదులు, అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. బల్దియా ప్రాంగణంలోనే ఇలా ఉంటే పట్టణం ఏం పట్టించుకుంటారని …

Read More »

గుండెపోటుతో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ మృతి

  కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నర్సింలు (45) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. నర్సింలు ఆకస్మిక మృతి పట్లసిబ్బంది, అదికారులు సంతాపం వ్యక్తం చేశారు. నర్సింలు కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు.

Read More »

బైక్‌ దొంగల అరెస్టు

  కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ముగ్గురు బైక్‌దొంగలనుపట్టుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పట్టణ ఎస్‌ఐ రాజు తెలిపారు. ఈనెల 17వ తేదీన పద్మవతి ఆసుపత్రి వద్ద పార్కుచేసి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని రాత్రి 9 గంటల సమయంలో దొంగిలించారన్నారు. బాధితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సోమవారం ఉదయం నిజాంసాగర్‌ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా సారయ్య, తోకల సాయికుమార్‌, చల్ల నరేశ్‌లను అనుమానాస్పదంగా కనిపించగా పట్టుకొని విచారించడంతో బైక్‌ …

Read More »

ఘనంగా రాహుల్‌ జన్మదిన వేడుకలు

  కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాందీ జన్మదిన వేడుకలను శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ ఆధ్వర్యంలో సోమవారం కామరెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ రాహుల్‌గాంధీ భావి ప్రదాని అని, ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటూ వారి మన్ననలు పొందారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ సారధ్యంలో పార్టీని ముందుకు తీసుకెళతామని షబ్బీర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మామిండ్ల అంజయ్య, వేణుగోపాల్‌గౌడ్‌, …

Read More »

యువకుల రక్తదానం

  కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆపదలో ఉన్న రోగికి అత్యవసరంగా రక్తం అవసరం కాగా ఇద్దరు యువకులు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. సంగమేశ్వర్‌ గ్రామానికి చెందిన రాజిరెడ్డికి అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తం అవసరమవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని సోమవారం సంప్రదించారు. శ్రీనివాస్‌రావు, నారాయణరెడ్డిలు రక్తదానంచేసి ప్రాణాలు కాపాడినట్టు బ్లడ్‌బ్యాంక్‌ నిర్వాహకులు బాలు తెలిపారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో టెక్నిషియన్‌ శ్రీలత, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

భూసంబంధిత వివరాలను పూర్తిస్థాయిలో ఉంచాలి

  కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో పంట భూములకు సంబంధించిన వివరాలను రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలని రైతు సమగ్ర సర్వేను పకడ్బందీగా పూర్తిచేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా వ్యవసాయదికారులు, రెవెన్యూ సిబ్బందితో సమావేశమయ్యారు. రైతు సమగ్రసర్వేలో సర్వేచేసిన రైతుల వివరాలు, సాగుచేస్తున్న భూములు, నీటి సదుపాయం, చెరువుల కింద, కాలువల కింద సాగుభూములు, బోర్లతో సాగుచేస్తున్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళవారం కల్లా …

Read More »

బల్దియా అధికార పాలకవర్గం పనితీరు మారాలి

  – అధికారుల పనితీరుపై డీసెంట్‌ నోటీసు కామారెడ్డి, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి బల్దియా అధికార పాలకవర్గం పనితీరు మారాలని, ఇందుకు సంబంధించి అధికారులకు డిసెంట్‌ నోటీసు అందజేసినట్టు శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ అన్నారు. సోమవారం బల్దియా పాలకవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పాలకవర్గం సమావేశాన్ని వాయిదా వేసి వెళ్లిపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం షబ్బీర్‌ అలీ విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఎజెండా అంశాలు చర్చించకుండా వాటిని ఆమోదించాలని …

Read More »

రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ

  నందిపేట, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్‌గాంధీ జన్మదినం సందర్భంగా సోమవారం ఆసుపత్రిలోని రోగులకు కాంగ్రెస్‌ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బండి నర్సాగౌడ్‌ మాట్లాడుతూ యువనేత రాహుల్‌గాంధీని ప్రజలు భావిప్రధానిగా చూడనున్నారని ఆశాబావం వ్యక్తంచేశారు. ఆయన వెంట ఎస్‌సి సెల్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బుడ్డ శివ, డిసిసి ఉపాధ్యక్షుడు సంజీవ్‌రాజు, యువజన కాంగ్రెస్‌ నాయకులు మహిపాల్‌, కిషోర్‌, ఉస్మాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  – ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నందిపేట, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయంలో సోమవారం పేద ముస్లింలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న దుస్తులను అందజేసిన అనంతరం మాట్లాడుతూ అన్ని మతాలను సమానంగా చూసిన ఘనత, మైనార్టీ సంక్షేమానికి అత్యదిక ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సిఎం కెసిఆర్‌కె దక్కుతుందన్నారు. తెరాస మేనిఫెస్టోను ఖురాన్‌ వలె గౌరవం కల్పిస్తు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారన్నారు. ఇమామ్‌లకు పెన్షన్ల పంపిణీ, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి ఆరుకిలోల బియ్యం, …

Read More »

కొనుగోలు చేశారు… డబ్బులు మరిచారు….

  బీర్కూర్‌, జూన్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన ప్రబుత్వం సరైన సమయంలో నగదును అందించడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్‌ బాన్సువాడ ప్రదాన రహదారిపై సోమవారం ధర్నా, రాస్తారోకో చేశారు. 48 గంటల్లో రైతులకు నగదు అందజేస్తామన్న ప్రబుత్వం నెల, రెండు నెలలు కావస్తున్నా నగదు జమచేయకపోవడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అప్పు తెచ్చుకున్న డబ్బు వడ్డిలు పెరుగుతున్నాయని, సరైన సమయంలో …

Read More »