Breaking News

Daily Archives: June 20, 2017

ఉచిత పుస్తకాల పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండవ సంవత్సరం విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఆర్‌.కె.కళాశాల ప్రిన్సిపాల్‌ జైపాల్‌రెడ్డి పుస్తకాలను విద్యార్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ప్రభుత్వం వేలాది రూపాయల విలువైన పుస్తకాలను ఉచితంగా అందిస్తుందని, ఈ అవకాశాన్ని విద్యార్థులందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్క రూపాయి ఫీజు లేకుండా అడ్మిషన్‌, ఉచిత పుస్తకాలు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధ్యాపకులు ముజాహిద్‌, అరుణ, …

Read More »

రెండేళ్లలో యాదవులందరికి గొర్రెల పంపిణీ

  – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో యాదవ సహకార సంఘాలన్నింటికి గొర్రెల పంపిణీ చేస్తామని ఈఏడాది సగం, వచ్చేఏడాది సగం చొప్పున రెండేళ్లలో అందరికి గొర్రెలు పంపిణీ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట గ్రామంలో మంగళవారం లబ్దిదారులకు సబ్సిడీ గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 7840 యాదవ సహకార సంఘాల్లో …

Read More »

వాడవాడకు బిజెపి

  కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ కార్య విస్తరణలో భాగంగా మంగళవారం బిజెపి నాయకులు పట్టణంలోని 208 బూత్‌ కేంద్రాల్లో వాడవాడకు బిజెపి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాడవాడకు బిజెపి, ఇంటింటికి నరేంద్రమోడి, తెలంగాణ అభివృద్దే దేశాభివృద్ది అనే నినాదంతో ఇంటింటికి తిరిగి ప్రజలకు ప్రధాని మోడి ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తున్నామన్నారు. కెసిఆర్‌ వైఫల్యాలను సైతం ఎండగడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోతె కృష్ణాగౌడ్‌, …

Read More »

న్యూ పారాడైజ్‌ రెస్టారెంట్‌ ప్రారంభం

  కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మునిసిపల్‌ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన హోటల్‌ న్యూ పారాడైజ్‌ రెస్టారెంట్‌ను మంగళవారం తెరాస మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, డిసిఎంఎస్‌ ఛైర్మన్‌ ముజీబుద్దీన్‌ ప్రారంభించారు. నాణ్యమైన వంట సరుకులు వాడి వినియోగదారులకు మంచి ఆహర పదార్థాలు అందించి వ్యాపారం అభివృద్ది చేసుకోవాలని సూచించారు. రెస్టారెంట్‌ ప్రతినిదులు మాట్లాడుతూ హోటల్‌లో ఇండియన్‌ బిర్యానితోపాటు, చైనీస్‌, తందూరి, చికెన్‌, ఇతర ఆహార పదార్థాలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు …

Read More »

ఘనంగా ఇందిరాగాంధీ శతజయంతి వేడుకలు

  కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ మాజీ ప్రధాని, దివంగత ఇందిరాగాంధీ శతజయంతి వేడుకలను మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బ్యాంకులు జాతీయం చేయడం ద్వారా ఇందిరా గాంధీ బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో సేవలందించారన్నారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు కోయల్‌కర్‌ కన్నయ్య, ఎంపిటిసి నిమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి, నాయకులు గోనె శ్రీనివాస్‌, …

Read More »

రహ (ప్రమాద) దారి

  నిజాంసాగర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయరహదారిపై ప్రమాదం పొంచి ఉన్నా రహదారుల శాఖ అధికారులు చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ రహదారి గుండా వెళ్లే వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సరం సెప్టెంబర్‌, అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు నర్సింగ్‌రావుపల్లి శివారులోగల నల్లవాగు మత్తడి వంతెన కోతకు గురైంది. అప్పట్లో జాతీయ రహదారుల శాఖ అధికారులు ఆదరబాదరాగా కోతకు గురైన రహదారికి మరమ్మతులు చేపట్టారు. కానీ రెయిలింగ్‌ నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో తరుచు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ …

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి సహాయనిధి కింద విడుదలైన చెక్కును మంగళవారం ప్రభుత్వ విప్‌, కామరెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ బాదిత కుటుంబానికి అందజేశారు. చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన మంగరి లావణ్య అనారోగ్యంతో హైదరాబాద్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంది. ఇందుకుగాను సిఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదలైన రూ. 19 వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రామాగౌడ్‌, ఉపసర్పంచ్‌ రమేశ్‌, ఎంపిటిసి గంగాధర్‌రావు, నాయకులు శ్రీను, లింగం, సుభాష్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

బుధవారం ఇఫ్తార్‌

  బీర్కూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలోని ఏఆర్‌ గార్డెన్‌లో బుధవారం మైనార్టీలకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేసినట్టు తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 50 వేల చెక్కు అందజేశామని, అట్టి నిధులతో మైనార్టీలకు ఇఫ్తార్‌ కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. మైనార్టీలందరు పాల్గొనాలని సూచించారు.

Read More »

పాఠశాల వాహనాల తనిఖీ

  బీర్కూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో ఎస్‌ఐ గోపి ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల వాహనాలను తనిఖీ నిర్వహించారు. వాహనాల దృవపత్రాలు, డ్రైవర్‌ లైసెన్సులను పరిశీలించారు. బస్సులో ఫిట్‌నెస్‌ లేకుండా విద్యార్థులను రవాణా చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Read More »

ఘనంగా ఇఫ్తార్‌ విందు

  బీర్కూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో మైనార్టీలకు మంగళవారం రాష్ట్ర ప్రబుత్వం ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్‌ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. నసురుల్లాబాద్‌లోని ఉర్దూ మీడియం పాఠశాలలో జరిగిన ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో తెరాస బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి పోచారం సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ మైనార్టీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అంకిత భావం కలిగి ఉందని, రిజర్వేషన్లు, షాదీముబారక్‌, బిసి -ఇలోకి మైనార్టీలకు చేర్చడం, హర్షించదగ్గ పథకాలు ఉన్నాయని ఆయన అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం …

Read More »