Breaking News

Daily Archives: June 22, 2017

టిజివిపి కార్యవర్గ సమావేశపు గోడప్రతుల ఆవిష్కరణ

  కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉస్మానియా యూనివర్సిటీలో జూలై 8,9 తేదీల్లో నిర్వహించనున్న టిజివిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని గురువారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎనుగందుల నవీన్‌ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపరిష్కారం, ప్రభుత్వ విద్య బలోపేతం, విద్యహక్కు చట్టం, కెజి నుంచి పిజి ఉచిత విద్య అమలు, ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యా వ్యాపారం, భవిష్యత్‌ కార్యాచరణపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రతినిదులు ప్రకాశ్‌, రాజు, మోహన్‌, వినయ్‌, …

Read More »

రైతులకు సబ్సిడీ రుణాలు సకాలంలో అందించాలి

  కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకర్లు రైతులకు సంబంధించిన సబ్సిడీ రుణాలను సకాలంలో అందించి వారి ప్రగతికి బాటలు వేయాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో లీడ్‌బ్యాంక్‌ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక రుణ ప్రణాళిక 2017-18 పుస్తకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతున్నా కుటుంబ సంతోష జీవన ప్రమాణంలో ప్రపంచ దేశాల్లో 121 స్థానంలో …

Read More »

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదానం

  కామరెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం అన్నదానం నిర్వహించారు. 108 లో పనిచేస్తున్న గౌస్‌పాషా అనే వ్యక్తి 15 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందగా ఆయన జ్ఞాపకార్థం సిబ్బంది అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌస్‌ పాషా కామారెడ్డిలో రెండేళ్ల పాటు సూపర్‌వైజర్‌గా సేవలందించారని అన్నారు. 2016-17లో నిజామాబాద్‌లో విధులు నిర్వహిస్తూ మృతి చెందాడని తెలిపారు. ఉమ్మడి జిల్లాల 108 సిబ్బంది పాషా మృతి పట్ల సంతాపం వ్యక్తం …

Read More »

విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో దర్నా

  కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని గురువారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ వైఖరి, ఎమ్మెల్యే వైఖరి నిరసిస్తూ దోమకొండ మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్దం చేశారు. పిడిఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దోమకొండ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం నిరవధిక దీక్షలు చేస్తున్నా ఎమ్మెల్యే గంప గోవర్దన్‌ …

Read More »

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవు

  బీర్కూర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నకిలీ విత్తనాలు విక్రయిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని వ్యవసాయాధికారి కమల అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలో సిఐ శ్రీనివాస్‌తో కలిసి ఎరువుల దుకాణాల తనిఖీ చేపట్టారు. పత్తి, సోయా, తదితర విత్తనాలు ప్రభుత్వం ఆమోదం పొందినవే విక్రయించాలని సూచించారు. కాలం చెల్లిన పురుగు మందులను, రసాయనిక ఎరువులు కూడా విక్రయించవద్దని సూచించారు. ఎరువుల దుకాణాలకు సంబంధించిన రిజిష్టర్లను పరిశీలించారు. ఎఇవో శ్రావణ్‌, ఏఎస్‌ఐ విఠల్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా ఇఫ్తార్‌

  బీర్కూర్‌, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని మిర్జాపూర్‌ గ్రామంలో మైనార్టీలు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రంజాన్‌ ఉపవాసాలు చాలా కఠినంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఎంతో దీక్షతో రంజాన్‌ పవిత్ర మాసాన్ని జరుపుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గపు యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ హైమద్‌, పురం వెంకట్‌, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Read More »