Breaking News

Daily Archives: June 23, 2017

అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలి

  బీర్కూర్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో తిరిగే అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని, ఎవరిపైన అయినా అనుమానం వస్తే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని బాన్సువాడ రూరల్‌ సిఐ శ్రీనివాస్‌రావు అన్నారు. నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో గురువారం రాత్రి పల్లెనిద్ర కార్యక్రమం ఎస్‌ఐ గోపితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఏటిఎంలపై అవగాహన, నూతన వ్యక్తులతో ప్రవర్తించే విధానం గురించి వివరించారు. స్తానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో కుల, మత బేదాలు …

Read More »

విద్యార్థులను వసతి గృహాల్లో చేర్పించాలి

  కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడిబాటలో భాగంగా తీసుకొచ్చిన విద్యార్థులను వసతి గృహాల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ కమీషనర్‌ ఐఆర్‌ఎస్‌ ఆర్‌.లక్ష్మణ్‌ అధికారులకు సూచించారు. హైదరాబాద్‌ నుంచి 31 జిల్లాల్లోని గిరిజన అభివృద్ది అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెబ్‌ పోర్టల్‌లో ఆధార్‌ నమోదుతో సహా విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయాలని సూచించారు. ట్యాబ్‌ సహాయంతో హాస్టళ్లను తనికీ చేయాలని ఆదేశించారు. కొత్తగా ప్రారంభించాల్సిన కళాశాలలు, …

Read More »

స్వయంసహాయక సంఘాల పనితీరుపై సమీక్ష

  కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో శుక్రవారం స్వయంసహాయక సంఘాల పనితీరుపై జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ సమీక్షించారు. నారీ ఫౌండేసన్‌ హైదరాబాద్‌ ప్రతినిధులతో సమావేశమై స్త్రీ సాధికారత, బాలికల ఆరోగ్యం, బహిష్టు శుభ్రత నిర్వహణ అంశాలపై చర్చించారు. స్వయం సహయక సంఘాలు చేపడుతున్న కార్యక్రమాలు, సమావేశాల్లో చర్చిస్తున్న అంశాలపై చర్చించారు. చిన్న సమాఖ్య నుంచి చిన్న సంఘం సభ్యురాలి వరకు ఏవిధంగా సమాచారం చేరుతుంది, జెండర్‌ కమిటీ సభ్యుల పనితీరుపై చర్చించారు. …

Read More »

ఓటరు జాబితా పకడ్బందీగా నిర్వహించాలి

  కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు నమోదు ప్రక్రియ మార్పులు, చేర్పులను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ హోంశాఖ కార్యదర్శి ఐఏఎస్‌ అనితా రాజేందర్‌ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయంలో శుక్రవారం ఓటర్ల జాబితాపై అధికారులతో సమీక్షించారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణతోపాటు అధికారులతో మాట్లాడారు. కొత్త ఓటర్ల నమోదు, ఓటరు లిస్టులో మార్పులు, చేర్పులు తొలగింపు ప్రక్రియ తదితర వివరాలను జిల్లా రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇష్టారీతిగా తొలగింపులు చేయవద్దని, నిర్ధారణకు వచ్చాకే జాబితా …

Read More »

గుంతలో పడి బాలుడి మృతి

  కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గ్రామం బీడీ వర్కర్స్‌ కాలనీలో శుక్రవారం ప్రమాదవశాత్తు గుంతలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. బీడీ వర్కర్స్‌ కాలనీకి చెందిన జునేద్‌ 17 నెలల బాలుడు ఆడుకుంటూ ఇంటి సమీపంలో పైప్‌లైన్‌కోసం తవ్విన గుంతలో పడి ఊపిరాడక మృతి చెందాడు. గమనించిన స్థానికులు బయటకు తీసినా పలితం దక్కలేదు. దీంతో జూనేద్‌ తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలవిసేలా రోదించారు. కొన్నిరోజుల్లో రంజాన్‌ పండగ ఉన్న …

Read More »

తెలంగాణలో తెదేపాకు పూర్వవైభవం తెస్తాం

  కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి అన్నారు. కామరెడ్డి జిల్లా కేంద్రంలో శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభించారు. పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో బలమైన పునాది ఉందన్నారు. పార్టీ కార్యకర్తలే పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ కల్లబొల్లి హామీలు, మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, …

Read More »