Breaking News

Daily Archives: June 24, 2017

ఉపాధి హామీలో రోడ్లకు ఇరువైపులా శుభ్రం చేయాలి

  కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీలో భాగంగా రోడ్లకు ఇరువైపులా ఉన్న తుమ్మ పొదలను శుభ్రం చేసే పనిని ఉపాధి కూలీలకు అప్పగించాలని జిల్లా కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అంకన్నగారి నాగరాజుగౌడ్‌, దోమకొండ ఎంపిడివోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనగామ నుంచి మహ్మదాపూర్‌ రోడ్డు, సంగమేశ్వర్‌ నుంచి మాదాపూర్‌ రోడ్డు, మాదాపూర్‌ నుంచి కాచాపూర్‌ రోడ్లలో ఇరువైపులా తుమ్మ పొదలు దట్టంగా పెరిగి రోడ్లు మూసుకుపోయే పరిస్థితి నెలకొందన్నారు. ఉపాధి …

Read More »

చెత్త డబ్బాల పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 2వ వార్డులో శనివారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ సమక్షంలో వార్డు కౌన్సిలర్‌ కాల్ల గణేష్‌ ఆధ్వర్యంలో చెత్త డబ్బాలు పంపిణీ చేశారు. తడి, పొడి చెత్త సేకరించేందుకు గాను వేరువేరు చెత్త డబ్బాలు ఉపయోగించాలని సూచించారు. చెత్తను ఇష్టారీతిగా వేయకుండా చెత్త డబ్బాలోనే వేసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్బంగా కోరారు.

Read More »

పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

  కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బోధనకై శనివారం నిర్వహించిన రాత పరీక్ష కేంద్రాన్ని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ పరిశీలించారు. సిసి కెమెరాలతో పరీక్షలు నిర్వహించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఏర్పాట్లపై అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు. స్పెషల్‌ ఆఫీసర్‌ రెండు పోస్టులకు 119 మంది దరఖాస్తు చేసుకోగా 91 మంది పరీక్షకు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. విషయబోధనకు సంబంధించిన 6 సబ్జెక్టులకు 12 పోస్టులకు గాను 307 …

Read More »

రంజాన్‌ ఏర్పాట్లు పరిశీలించిన చైర్‌పర్సన్‌

  కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించనున్న రంజాన్‌ పండగ ఏర్పాట్లను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ శనివారం పరిశీలించారు. రంజాన్‌ పండగ నేపథ్యంలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ క్రమంలో మజీద్‌ల వద్ద గుంతలు పూడ్చేందుకు రూ. లక్షన్నర ఇదివరకే మంజూరు చేసినట్టు ఆమె తెలిపారు. వీధి దీపాలు, ఇతర సౌకర్యాలు సమకూరుస్తున్నట్టు చెప్పారు. ఆమె వెంట వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, వక్ప్‌ బోర్డు అధ్యక్షుడు మహ్మద్‌ జమీర్‌, కౌన్సిలర్‌ …

Read More »