Breaking News

సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ రాజు మృతి

సినీ నటుడు రవితేజ సోదరుడు భూపతిరాజు భరత్ రాజు మృతి చెందారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ కన్నుమూశారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఆగిఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం శనివారం రాత్రి 10 గంటలకు జరిగినట్లు సమాచారం. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం భరత్ తుదిశ్వాస విడిచారు.

రవితేజకు భరత్ పెద్ద తమ్ముడు. రెండో తమ్ముడు రఘు. భరత్ కూడా నటుడే. ఇప్పటికే ఆయన చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. ఎక్కువగా విలన్ పాత్రలను భరత్ పోషించారు. రెడీ, ఆ ముగ్గురు, జంప్ జిలానీ, రామ రామ కృష్ణ కృష్ణ వంటి సినిమాల్లో భరత్ నటించారు.

Check Also

ఇసుక మాఫియా చేతిలో విఆర్‌ఏ దారుణ హత్య

  కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గం పిట్లం మండలం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *