Breaking News

Daily Archives: June 26, 2017

మృతి చెందిన వానరం – అంత్యక్రియలు జరిపిన గ్రామస్తులు

  బీర్కూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో సోమవారం హనుమాన్‌ ఆలయం వద్ద వానరం మృతి చెందింది. చెట్టుపై నుంచి ఇంటిపైకి దూకే క్రమంలో పైకప్పు రేకు తగలడంతో మృతి చెందిందని గ్రామస్తులు తెలిపారు. వానరం మృతి చెందడంతో గ్రామస్తులు చందాలు వేసుకొని భాజా భజంత్రీలతో వానరానికి అంత్యక్రియలు నిర్వహించి గ్రామశివారులో పూడ్చిపెట్టారు. గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Read More »

ఘనంగా రంజాన్‌

  బీర్కూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో సోమవారం ముస్లింలు రంజాన్‌ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం రాత్రి నెలవంక కనబడడంతో సోమవారం ఉదయం నుంచే నూతన వస్త్రాలతో ఈద్గాల వద్దకు చేరుకున్నారు. మతపెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న పిండి, తీపి వంటలతో బంధువులు, మిత్రులతో ఆనందంగా పండగ జరుపుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బీర్కూర్‌ పోలీసు స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి పండగ …

Read More »

రంజాన్‌ పండగ సందర్భంగా నేతల శుభాకాంక్షలు

  బీర్కూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో రంజాన్‌ పండగ సందర్భంగా పలు పార్టీల నేతలు మైనార్టీలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీర్కూర్‌ గ్రామంలో ముస్లింలను ప్రత్యేకంగా కలిసి ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజు బీర్కూర్‌ గ్రామంలోని పోచారం కాలనీలో మైనార్టీలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఎంపిపి మల్లెల మీణ హన్మంతు, జడ్పిటిసి కిషన్‌ నాయక్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ …

Read More »

మైనార్టీనేతలకు అభినందనల వెల్లువ

  కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన రంజాన్‌ పర్వదినం పురస్కరించుకొని మైనార్టీ నేతలకు అభినందనలు వెల్లువెత్తాయి. శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీతోపాటు ఐడిసిఎంఎస్‌ ఛైర్మన్‌, తెరాస మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ముజీబుద్దీన్‌, మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీలను ఆయా పార్టీల నేతలు, ప్రజలు కలిసి పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా వద్ద జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేతారెడ్డి, ఆర్డీవో శ్రీనులు వారికి పండగ శుభాకాంక్షలు తెలిపారు. అందరు కలిసి సోదర …

Read More »

ఆర్యక్షత్రియుల సమస్యల పరిష్కారానికి కృషి

  కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యక్షత్రియ కులస్తుల సమస్యల పరిష్కారంతో పాటు పలు వసతులు సమకూర్చుకునేందుకు త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవనున్నట్టు ఆర్యక్షత్రియ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌ తెలిపారు. ఈ క్రమంలో సోమ, మంగళవారాల్లో ఆరెకుల సంక్షేమ సంఘం సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎకరం స్థలం కేటాయించి పదికోట్ల నిధులతో రాష్ట్ర సంఘ భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఆర్యక్షత్రియ కులస్తులకు ధర్మసత్రాలు ఏర్పాటు చేయాలని …

Read More »

సీనియర్‌ సిటిజన్లకు ఎల్లప్పుడు తోడుగా ఉంటా

  – జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీనియర్‌ సిటిజన్లకు తాను ఎల్లప్పుడు తోడుగా ఉంటానని వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. సోమవారం సీనియర్‌ సిటిజన్ల ఫోరం విద్యానగర్‌ కాలనీ కార్యాలయం ఆవరణలో కలెక్టర్‌ మొక్కలు నాటి నీరుపోశారు. అనంతరం ఆయన స్వయాన సమకూర్చిన టేబుల్‌ టెన్నిస్‌, జిమ్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వృద్దాప్యంలో ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి సమాజానికి తమవంతు సేవ …

Read More »

మైనార్టీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి

  – శాసనమండలి విపక్షనేత షబ్బీర్‌ అలీ కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రిజర్వేషన్ల ద్వారానే మైనార్టీల ప్రగతి సాధ్యపడుతుందని ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వంపై విపక్షాల తరఫున ఒత్తిడితెస్తామని శాసనమండలి విపక్ష నేత షబ్బీర్‌ అలీ అన్నారు. సోమవారం రంజాన్‌ పండగ పురస్కరించుకొని నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనార్టీలనుద్దేశించి మాట్లాడారు. మైనార్టీలు అవకాశాలు అందిపుచ్చుకోవాలని, వారికోసం ఉన్న అవకాశాలు వాడుకొని తద్వారా ప్రగతి సాధించాలని సూచించారు. విద్యాభివృద్దిని సాధించి తద్వారా ముందుకెళ్లాలని సూచించారు. …

Read More »

ఘనంగా రంజాన్‌ వేడుకలు

  కామారెడ్డి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం రంజాన్‌ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. రంజాన్‌ను పురస్కరించుకొని పట్టణంలోని ముస్తాబు చేసిన ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్తనలు నిర్వహించారు. చిన్న, పెద్ద తేడా లేకుండా మైనార్టీలందరు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఒకరినొకరు కలుసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఇళ్లలో తయారుచేసిన ప్రత్యేక వంటకాలను ఆరగించారు. పండగ నేపథ్యంలో పట్టణంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఆయా పార్టీల నాయకులు, ప్రజలు కుల, మత …

Read More »

కలుషిత నీరుతాగి వాంతులు, విరోచనాలు

  గాంధారి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలం ప్రారంభం కావడంతో గిరిజన తాండాల్లో కలుషిత నీరు ప్రవహిస్తుంది. దీంతో కలుషితనీరు తాగిన తాండవాసులు రోగాలబారిన పడి ఆసపత్రుల్లో చిక్తిత్స పొందుతున్నారు. గత వారంరోజులుగా కురుస్తున్న వర్సాలకు గ్రామాల్లో తాగునీరు కలుషితమవుతుంది. నీటిని తాగి, వాంతులు, విరోచనాలు చేసుకుంటున్నారు. ఇదే సంఘటన గాంధారి మండలం పెద్ద గుజ్జుల్‌ తాండాలో చోటుచేసుకుంది. వారంరోజులుగా తాండాల్లో గిరిజనులు కలుషిత నీరు తాగడం వల్ల రోగాల బారిన పడ్డారు. తరచూ వాంతులు, విరోచనాలు చేసుకుంటున్నారు. …

Read More »

డిప్యూటి సిఎంకు రంజాన్‌ శుభాకాంక్షలు

  గాంధారి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పర్వదినాన్ని ముస్లిం ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటి సిఎం మహమూద్‌ అలీని గాంధారి జడ్పిటిసి, తెలంగాణ జడ్పిటిసి పోరం ఉపాధ్యక్షుడు హరాలే తానాజీరావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జహీరాబాద్‌ ఎంపి బి.బి.పాటిల్‌తో కలిసి వెళ్లిన తానాజీరావు మహమూద్‌ అలీని కలిసి రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో నెలరోజులపాటు ముస్లింలు నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, రంజాన్‌ పండుగలో పాలుపంచుకున్నారని, తెలంగాణ ప్రజలకు, ముస్లింలకు …

Read More »