Breaking News

Daily Archives: June 30, 2017

విధుల్లో సేవలు మరువలేనివి

  జిల్లా సాంఘిక సంక్షేమాధికారి దేవిదాస్‌ కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగ విదుల సమయంలో సేవలు చేసిన వారి జీవితంలో ప్రజలు మరిచిపోరని జిల్లా సాంఘిక సంక్షేమాధికారి దేవిదాస్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో వివిధ శాఖల్లో పనిచేస్తు పదవివిరమణ పొందిన రాజారమేశ్‌, సుగుణ, మాదర్‌లను సన్మానించారు. వారు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ప్రత్యేక వాహనాల్లో వారి వారి ఇళ్లకు వారిని తరలించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు శ్రీనివాస్‌, రాజు, మోతిసింగ్‌లు ఉన్నారు.

Read More »

విద్యుత్‌షాక్‌తో గేదెల మృతి

  బీర్కూర్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామానికి చెందిన రెండు గేదెలు విద్యుత్‌ షాక్‌తో మృతి చెందాయి. స్థానికుల కథనం ప్రకారం గత మూడురోజులుగా కురుస్తున్న వర్సాలకు విద్యుత్‌ స్థంభాలు తెగిపడ్డాయి. గేదెలు మేత మేస్తుండగా విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్టు యజమాని రఫీ తెలిపారు. పాలవ్యాపారం చేసుకుంటూ తాను జీవనం సాగిస్తున్నానని, రెండు గేదెలు సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని, తమకు పరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు.

Read More »

హరితహారం విజయవంతం చేయాలి

  గాంధారి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గాంధారి తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక తహసీల్‌ కార్యాలయంలో పూల మొక్కలు నాటారు. స్వయంగా ఖర్చులతో తెప్పించిన ఖరీదైన పూలమొక్కలను కార్యాలయ ఆవరణలో నాటారు. ఇదేవిధంగా మరిన్ని పూల మొక్కలను నాటుతున్నట్టు తెలిపారు. గత సంవత్సరం కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కలు ఎప్పటికప్పుడు సంరక్షిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా వాటిని కాపాడుతామని అన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి యాదగిరి, సిబ్బంది ఉన్నారు.

Read More »

డిమాండ్ల పరిష్కారానికి కదిలిన ముదిరాజ్‌లు

  గాంధారి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తమ డిమాండ్లను పరిష్కరించాలని ముదిరాజ్‌ కులస్తులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా గాంధారి మండల కేంద్రంలో మండలానికి చెందిన ముదిరాజ్‌లు జిల్లా కమిటీ సభ్యులతో కలిసి భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పెద్దమ్మ ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బైక్‌ ర్యాలీ కొనసాగింది. అనంతరం స్థానిక తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌, ఎండివో సాయాగౌడ్‌లకు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి భట్టు విఠల్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ …

Read More »

హరితహారం వేగవంతం చేద్దాం

  నిజాంసాగర్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు హరితహారం పథకం మండలంలో వేగవంతంగా కొనసాగుతుందని, సిఎం కెసిఆర్‌ ప్రవేశపెట్టిన ఈ పథకానికి ప్రతి కుటుంబంలో మొక్కలు నాటే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. గ్రామాల సమీపంలోగల నర్సరీల నుంచి మొక్కలను వ్యవసాయ గట్లపై, అటవీ ప్రాంతాల్లో కూలీలచే నాటిస్తున్నారు. మండలంలోని కోమలంచ, సింగీతం, గున్కుల్‌ గ్రామాల్లో హరితహారం పథకంలో నాటుతున్న మొక్కలను ఎంపిడివో రాములు నాయక్‌, ఉపాధి హామీ ఎపివో సుదర్శన్‌లు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ మొక్కలు …

Read More »

తహసీల్దార్‌ను సన్మానించిన రేషన్‌ డీలర్లు

  నిజాంసాగర్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్‌ అబ్దుల్‌ గనిఖాన్‌ పదవి విరమణ పొందడంతో రేషన్‌ డీలర్ల అసోసియేషన్‌ ఆద్వర్యంలో శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. రేషన్‌ డీలర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ నిజంసాగర్‌ మండల ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించారని, మండల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారన్నారు. కార్యక్రమంలో గిర్దావర్‌ సయ్యద్‌ హుస్సేన్‌, రేషన్‌ డీలర్లు కిష్టయ్య, ఆగమయ్య, సురేశ్‌, రఫీక్‌, గంగారాం, వీరేశం, …

Read More »

ఆన్లైన్ మీడియా జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఆన్లైన్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఆన్లైన్ మీడియా జర్నలిస్ట్స్ యూనియన్ (తోజు) మరియు తెలంగాణ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తోమ్జ) రెండు వీలినమయ్యి తెలంగాణ ఆన్లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తొమ్వాజ) గా ఆవిర్భవించింది. ఈ సందర్భంగా తొమ్వాజ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకుంది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆయిలు రమేష్ మాట్లాడుతూ ప్రింట్ …

Read More »