Breaking News

Daily Archives: July 1, 2017

హరితహారంపై కళాజాత

  బీర్కూర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై కళాకారులు తమ ప్రదర్శన ద్వారా సంపూర్ణ అవగాహన కల్పించారు. బీర్కూర్‌ మండలంలోని కిష్టాపూర్‌ గ్రామంలో శనివారం కామరెడ్డి జిల్లా అటవీశాఖ ఆద్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ కళాజాత నిర్వహించారు. కళాకారులు విఠల్‌రెడ్డి, ఆకుల మహేందర్‌, కాశీరాం, నర్సయ్య, పోశెట్టి, రాము, ఒడ్డెన్న, దివ్య, రమేశ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా బాన్సువాడలోని ఆయా గ్రామాల్లో హరితహారంపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. మొక్కలు ఉంటే క్షేమమని, ...

Read More »

ఘనంగా డాక్టర్స్‌ డే

  కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో శనివారం డాక్టర్స్‌ డే ను ఘనంగా నిర్వహించారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలోవైద్యులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ, ఎస్‌పి శ్వేతారెడ్డి, తెలంగాణ ఆహారశాఖ ఛైర్మన్‌ తిరుమల్‌రెడ్డిలు హాజరై వైద్యులను సన్మానించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమాజంలో వైద్యుల పాత్ర ఎనలేనిదని, దేవుడి తర్వాత దేవుడి పాత్రను వైద్యులు పోషిస్తారన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌, డాక్టర్‌ శ్యాంసుందర్‌, వైద్యులు పాల్గొన్నారు.

Read More »

విజ్ఞాన కేంద్రాలతో విద్యార్థులకు విజ్ఞానం

  కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజ్ఞాన కేంద్రాల ద్వారా విద్యార్థుల్లో విజ్ఞానం పెంపొందించడంతోపాటు సైన్స్‌ సులువుగా అర్థమయ్యేందుకు దోహదపడుతుందని కామరెడ్డి జిల్లాకలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. కామరెడ్డి జిల్లా కేంద్రంలోని డిప్యూటి డిఇవో కార్యాలయ ప్రాంగణంలో శనివారం కలెక్టర్‌ అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ వారి విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఫౌండేషన్‌వారు గత 4 సంవత్సరాలుగా కామారెడ్డిలో సైన్స్‌ మోబైల్‌ ల్యాబులోని పరికరాల ద్వారా భౌతిక, రసాయన, జీవ, ఖగోళ శాస్త్రాలకు సంబందించిన కృత్యాలను ప్రయోగాత్మకంగా విద్యార్థులకు వివరిస్తున్నారు. కలెక్టర్‌ ...

Read More »

జిఎస్‌టి రద్దుకై ఎల్‌ఐసి ఏజెంట్ల ధర్నా

  కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇన్సురెన్సు ప్రీమియంపై జిఎస్‌టి రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తు శనివారం కామారెడ్డి ఎల్‌ఐసి కార్యాలయం ఎదుట ఏజెంట్లు ధర్నా చేశారు. జిఎస్‌టిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ జీవితబీమా, ఆరోగ్య ప్రమాదబీమా, కుటుంబ సామాజిక భద్రతకు సంబంధించిందన్నారు. దీన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఇన్సురెన్సుపై జిఎస్‌టి రద్దుచేయాలని,బీమా రంగాన్ని ప్రోత్సహించాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు కిషోర్‌ చంద్‌, భైరయ్య, మోహన్‌, భగవంత్‌రెడ్డి, సత్యనారాయణ, పుట్ట నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Read More »

గుడుంబా తయారీ నిలిపివేసిన వారికి చేయూత

  కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గతంలో గుడుంబా తయారుచేసి వృత్తిని మానేసిన వారికి ఆర్థికంగా చేయూతనందిస్తున్నట్టు ఎక్సైజ్‌, నిషేద శాఖపర్యవేక్షణ అధికారి కె.చంద్రశేఖర్‌ అన్నారు. ఇందులో భాగంగా శనివారం గాంధారి మండలంలోని పలు గుడుంబా తయారీ కుటుంబాలను కలిశారు. రమావత్‌ మోతి అనే గిరిజన మహిళకు కిరాణ దుకాణం కోసం వసతి సౌకర్యాలు పరిశీలించారు. సామగ్రికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోచారం తాండాకు చెందిన కె.విశ్వనాథ్‌ గృహాన్ని పరిశీలించారు. అనంతరం పిట్లం మండలం పోతరెడ్డి పల్లి ...

Read More »

రక్తదానంలో ఆదర్శం న్యాయవాది బాలు

  కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 50 సార్లు రక్తదానం చేసి కామారెడ్డికి చెందిన న్యాయవాది బాలు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. శనివారం ఓ రోగికి అత్యవసరంగా రక్తం అవసరం కావడంతో న్యాయవాది, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలుని సంప్రదించారు. ఆయన వి.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో 50వ సారి రక్తదానం చేశాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా కామారెడ్డి డివిజన్‌ వ్యాప్తంగా ఎవరికి అత్యవసర పరిస్థితిలో రక్తం అవసరమైనా స్పందించి రక్తదానం చేస్తున్నానన్నారు. కామారెడ్డి ...

Read More »

చెత్త డబ్బల పంపిణీ

  కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 10వ వార్డులో వార్డు కౌన్సిలర్‌ కైలాస్‌ లక్ష్మణ్‌ శనివారం వార్డు వాసులకు చెత్త డబ్బాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తను ప్రజలు ఇష్టారీతిగా పడేయకుండా వారికి అందించిన రెండు డబ్బాల్లో తడి, పొడి చెత్త వేరువేరుగా వేయాలన్నారు. వాటిని మునిసిపల్‌ చెత్త రిక్షాలు వచ్చినపుడు అందజేయాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని రోగాలబారిన పడకుండా ఉండాలని పేర్కొన్నారు.

Read More »

చెత్త డబ్బాల పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని 7వ వార్డు పరిధిలో కాలనీ వాసులకు శుక్రవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ చెత్త డబ్బాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె కాలనీ వాసులనుద్దేశించి మాట్లాడారు. ప్రజలు తడి, పొడి చెత్త వేరువేరుగా సేకరించి తమకు ఇచ్చిన డబ్బాలో వేసి మునిసిపల్‌ సిబ్బందికి సహకరించాలన్నారు. పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దడానికి తమవంతు సహకారం కూడా ఉండాలని కోరారు. అనంతరం వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను మునిసిపల్‌ సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ వెంకట్‌నాయక్‌ ...

Read More »

వేతనాలు పెంచాలని కార్మికుల వినతి

  కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మునిసిపల్‌ కాంటాక్టు కార్మికులు తమకు వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేస్తు శుక్రవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకుడు రాజనర్సు మాట్లాడుతూ హైదరాబాద్‌లోని గ్రేటర్‌ మునిసిపల్‌లో కార్మికులకు పెంచిన విధంగా మునిసిపాలిటిలో కార్మికులకు కూడా వేతనాలు పెంచాలన్నారు. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులకు న్యాయం చేయాలన్నారు. సీనియర్‌ కార్మికులను పర్మనెంట్‌ చేసి తగిన వేతనాలు అందించాలని డిమాండ్‌ చేశారు. వినతి పత్రం అందించిన ...

Read More »