Breaking News

Daily Archives: July 3, 2017

నిజామాబాద్ మండలం మల్లారం శివారు లో చిరుత పులి మృతి

విద్యుత్ స్థంభం ఎక్కిన చిరుత కరెంట్ షాక్ తగలడంతొ మృతి స్థంభం తీగలపై వేలాడిన చిరుత ను స్థానికులు నిజామాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ వెటర్నరీ ఆసుపత్రి కి చిరుత మృతదేహం తరలిస్తున్న అటవీ అధికారులు

Read More »

కొనసాగుతున్న వైద్య శిబిరం

  గాంధారి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారిమండలం పిస్కల్‌గుట్టలో వైద్య శిబిరం కొనసాగుతుంది. గత రెండురోజులక్రితం తాండాలో డయేరియా వ్యాధి విజృంభించడంతో తాండావాసులు వాంతులు, విరోచనాలతో బాధపడ్డారు. కొందరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసుకోగా మరికొందరు కామారెడ్డికి తరలివెళ్లారు. దీంతో తాండాలోనే వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స నిర్వహిస్తున్నారు. తాండాల్లో మినరల్‌ వాటర్‌ను సరఫరా చేస్తున్నారు. వైద్యశిబిరాన్ని సోమవారం స్థానిక జడ్పిటిసి తానాజీరావు, సర్పంచ్‌ సత్యంలు పరిశీలించారు. ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ...

Read More »

అన్యాక్రాంతమైన అటవీభూమిపై విచారణ

  గాంధారి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం నాగ్లూర్‌ గ్రామ శివారులో అన్యాక్రాంతమైన అటవీభూమి వివాదంపై అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. దీంతో ఎల్లారెడ్డి డిఎస్‌పి నర్సింహ, డిఎఫ్‌వో బాలమణి, సబ్‌ డిఎఫ్‌వో గోపాల్‌రావు విచారణ చేపట్టారు. మొదటగా గాంధారి అటవీ కార్యాలయంలో విచారణ చేయగా స్తానిక జడ్పిటిసి తానాజీరావు డిఎఫ్‌వోతో మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలుగా వందల ఎకరాల అటవీభూమిని అక్రమంగా సాగుచేస్తున్నా ఫారెస్టు అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు. దీంతో డిఎఫ్‌వో బాలమణి స్పందిస్తు ...

Read More »

టియుడబ్ల్యుజె ఐజెయు కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టియుడబ్ల్యుజె ఐజెయు కామరెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్‌ మీడియా,ప్రింట్‌ మీడియా కార్యవర్గాలను ఆదివారం రాత్రి కామారెడ్డిలో ఎన్నుకున్నారు. ప్రింట్‌ మీడియా జిల్లా అధ్యక్షునిగా లతీఫ్‌, కార్యదర్శిగా గోపి, కోశాధికారిగా ముదాం వెంకటేశ్వర్‌లు ఎన్నికయ్యారు. ఎలక్ట్రానిక్‌ మీడియా జిల్లా అధ్యక్షునిగా పి.శ్రీనివాస్‌, ఉపాధ్యక్షునిగా మాదప్ప,చంద్రశేఖర్‌, ప్రభాకర్‌, సహ కార్యదర్శులుగా రామకృష్ణ, వెంకటరత్నం, ఆబీద్‌, కోశాధికారిగా యూనుస్‌, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా హర్షద్‌ తదితరులు ఎన్నికయ్యారు.

Read More »

వంద శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలి

  బీర్కూర్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లోని ప్రతిగ్రామంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని మండల అభివృద్ది అధికారి భరత్‌కుమార్‌ అన్నారు. ససురుల్లాబాద్‌ మండలంలోని మీర్జాపూర్‌ గ్రామంలో సోమవారం సర్పంచ్‌ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. మొదటగా మూడునెలల ఆదాయ, వ్యయాలను పంచాయతీ కార్యదర్శి గ్రామస్తులకు చదివి వినిపించారు. అనంతరం ఎండివో మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు గ్రామాభివృద్దికి అందరు సహకరించాలని సూచించారు. రానున్నది వర్షాకాలం కావున సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశముందన్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, ...

Read More »

టియుడబ్ల్యుజె నూతన అధ్యక్షునికి సన్మానం

  బీర్కూర్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం కామారెడ్డిలో జరిగిన టియుడబ్ల్యుజె ఎన్నికల్లో బాన్సువాడ కు చెందిన లతీఫ్‌ సమీప అభ్యర్థి కృస్ణపై గెలుపొందారు. ఈ సందర్బంగా నూతన అధ్య్ష, కార్యదర్శులను బీర్కూర్‌ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో సోమవారంపూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా లతీఫ్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన కొరకు ఎల్లవేళలా ముందుంటానని అన్నారు. కార్యక్రమంలో గణేష్‌, గంగాధర్‌, సంతోష్‌, భవాని, వంశీ, మహబూబ్‌, మోటూరి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.

Read More »

ఫోటోస్పాట్‌ పుస్తకావిష్కరణ

  గాంధారి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల ఫోటోగ్రాపర్స్‌ యూనియన్‌ రూపొందించిన ఫోటోస్పాట్‌ పుస్తకాన్ని సోమవారం తహసీల్దార్‌ఎస్‌.వి.లక్ష్మణ్‌ ఆవిష్కరించారు. స్థానిక తహసీల్‌ కార్యాలయంలో యూనియన్‌ సభ్యుల సమక్షంలో పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రపంచంలో ఎన్నో వింతలను తమ కెమెరాలో బంధించి ఆస్వాదించే అవకాశం కేవలం ఫోటోగ్రఫర్లకి ఉందన్నారు. కార్యక్రమంలో మండల ఫోటోగ్రాపర్స్‌ యూనియన్‌ సభ్యులు బాల్‌రాజు, ప్రభు, సురేశ్‌, వెంకట్‌, సంతోష్‌, నవీన్‌, రాము, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

విజ్ఞానభారతి డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

  కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం విడుదలైన ఉస్మానియా యూనివర్సిటీ ఓయు సెట్‌ ఫలితాల్లో కామారెడ్డి విజ్ఞాన భారతి డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిబ కనబరిచారు. కళాశాలకు చెందిన బిఎ హెచ్‌ఇపి విద్యార్థిని గౌసియా బేగం యూనివర్సిటీ పరిధిలో ఎకనామిక్స్‌ విభాగంలో 9వ ర్యాకుం సాధించినట్టు తెలిపారు. కళాశాల కరస్పాండెంట్‌ బాపురెడ్డి ఆమెను సన్మానించారు. ప్రిన్సిపాల్‌ కాశాగౌడ్‌, అధ్యాపక బృందం రాజు, శ్రీనివాస్‌, మహిపాల్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Read More »

భూకబ్జాపై ఆర్డీవోకు ఫిర్యాదు

  కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన 40 మంది రైతులు సోమవారం కామరెడ్డి ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చి ఆర్డీవో శ్రీనుకు భూకబ్జాపై ఫిర్యాదు చేశారు. ఎస్‌సి కులానికి చెందిన 40 కుటుంబాలకు వంద ఎకరాల భూమి ఉందన్నారు. ప్రస్తుతం ఓ వ్యక్తి తమ పొలానికి సంబంధించిన తోవలో హద్దురాళ్ళు పాతి పొలంలోకి వెళ్లకుండా కంచె వేశారన్నారు. ఇద్దరు వ్యక్తులు తమపై దాడిచేస్తున్నారని, తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచ్‌కు ...

Read More »

గెజిటెడ్‌ అధికారుల సంక్షేమ సంఘం ఏర్పాటు

  కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని గెజిటెడ్‌ అధికారులందరు సంక్షేమసంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంఘం అధ్యక్షురాలిగా డిఆర్వో మణిమాల, కోశాధికారిగా పిఅండ్‌ఇ సూపరింటెండెంట్‌ కె.చంద్రశేఖర్‌, కార్యదర్శిగా డిబిసిడివో దేవిదాస్‌, సహ కార్యదర్శులుగా డిఆర్‌డివో పిడి చంద్రమోహన్‌, జిఎండిఐసి శ్రీనివాసులు, డిసిఎస్‌వో రమేశ్‌, డిటిడివో గంగాధర్‌, డిహెచ్‌ఎస్‌వో శేఖర్‌బాబు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శిగా డిటివో రవికుమార్‌, ప్రచార కార్యదర్శులుగా డిఎఫ్‌వో బాలమణి, ఎడి మైన్స్‌ రవి, డిఇవో మదన్‌మోహన్‌, ఆర్టీవో దుర్గాప్రమీల, ఇఇ ఆర్‌అండ్‌బి అంజయ్యలు ఎన్నికయ్యారు. వీరిని ...

Read More »

డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు 20 ఫిర్యాదులు

  కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి 20 పిర్యాదులు అందినట్టు అదికారులు తెలిపారు. సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ సత్యనారాయణ ఫోన్‌ ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలు కలెక్టర్‌తో ఫోన్‌ద్వారా మాట్లాడి తమ సమస్యలను విన్నవించారు. ఫిర్యాదులన్నింటిని స్వీకరించిన కలెక్టర్‌ వాటి పరిష్కారం కోసం వివిధ శాఖలకు పంపారు.

Read More »

ప్రజావాణిలో 97 ఫిర్యాదులు

  కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 97 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. వివిధ శాఖలకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులకు పంపించారన్నారు. వాటిని పరిశీలించి పరిష్కరించాలని ఆయా శాఖల అదికారులకు కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో జేసి సత్తయ్య, డిఆర్వో మణిమాల, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »