Breaking News

భూకబ్జాపై ఆర్డీవోకు ఫిర్యాదు

 

కామారెడ్డి, జూలై 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన 40 మంది రైతులు సోమవారం కామరెడ్డి ఆర్డీవో కార్యాలయానికి తరలివచ్చి ఆర్డీవో శ్రీనుకు భూకబ్జాపై ఫిర్యాదు చేశారు. ఎస్‌సి కులానికి చెందిన 40 కుటుంబాలకు వంద ఎకరాల భూమి ఉందన్నారు. ప్రస్తుతం ఓ వ్యక్తి తమ పొలానికి సంబంధించిన తోవలో హద్దురాళ్ళు పాతి పొలంలోకి వెళ్లకుండా కంచె వేశారన్నారు. ఇద్దరు వ్యక్తులు తమపై దాడిచేస్తున్నారని, తమ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. సర్పంచ్‌కు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు సాయిలు, సంజీవులు, ఆశ, కైలాష్‌, నర్సింలు, శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *