Breaking News

Daily Archives: July 5, 2017

విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొడతాం

  కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కెసిఆర్‌ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని సిపిఐ సీనియర్‌ నాయకుడు వి.ఎల్‌.నర్సింహారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో బుధవారం ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో జీపుయాత్ర ప్రారంభించారు. విద్యారంగ, వసతిగృహ సమస్యల అధ్యయనానికి జీపుయాత్ర నిర్వహిస్తున్నట్టు తెలిపారు.స్థానిక బాలికల ఇంటిగ్రేటెడ్‌ వసతిగృహంలో యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, కళాశాలలు సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని …

Read More »

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి

  కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టుల సమస్యల పరిస్కారానికి కృసి చేస్తామని టియుడబ్ల్యుజె ఐజెయు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎస్‌.ఎ.లతీఫ్‌ అన్నారు. కామరెడ్డి జిల్లా నూతన కార్యవర్గ సమావేశం బుధవారం జిల్లాకేంద్రంలో నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన లతీఫ్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు ప్రయివేటుపాఠశాలల్లో ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని జిల్లా కలెక్టర్‌, డిఇవోలకు విన్నవిస్తామన్నారు. జిల్లాలో పనిచేస్తున్న అన్ని పత్రికల విలేకరులకు అక్రిడేషన్‌ కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు,డబుల్‌ బెడ్‌ …

Read More »

వ్యవసాయ రంగాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతాం

  – వ్యవసాయ శాఖ మంత్రి పోచారం కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలుపబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో బుధవారం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని 473 గ్రామాల్లో వంద క్లస్టర్లలో ఇప్పటివరకు 79.25 శాతం సర్వే నిర్వహించామన్నారు. జిల్లాలో మొత్తం 2,40,028 మంది రైతులుండగా 1,90,255 మంది రైతులను కలిసి వివరాలు …

Read More »

బీడీలపై జిఎస్‌టి తగ్గించాలి

  కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిఎస్‌టి కారణంగా బీడీ పరిశ్రమపై పెనుభారం పడిందని, కేంద్ర ప్రభుత్వం బీడీలపై వేసిన జిఎస్‌టి తగ్గించాలని నూతన బీడీ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి శివంగిసత్యం డిమాండ్‌ చేశారు.బుధవారం ఆయన కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ బీడీ ఆకులపై 18 నుంచి 28 శాతం జిఎస్‌టి పన్ను విధించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న 60 లక్షల మంది బీడీ కార్మికులు బీడీ పరిశ్రమపై ఆదారపడి జీవిస్తున్నవారిపై ప్రభావం పడుతుందన్నారు. ప్రభుత్వం కార్మికుల గురించి …

Read More »

బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యం వ్యవసాయానికే

  -రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర బడ్జెట్‌లో సింహభాగం నిధులను వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించారని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో బుధవారం జిల్లాస్తాయి బ్యాంకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2016-17లో జిల్లా బ్యాంకుల రుణాల లక్ష్యం రూ. 2 వేల 98 కోట్లు కాగా అందులో 82 శాతం రూ. 1734 కోట్లు ఇచ్చారన్నారు. 2017-18లో జిల్లా రుణ …

Read More »

బహిరంగ మలవిసర్జన చేస్తే జరిమానా

  నిజాంసాగర్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోనే తమ గ్రామం ఆదర్శంగా నిలవాలని వంద శాతం మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తిచేసేందుకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా సభ్యులు ప్రజల సహకారంతో అందుకున్నామంటూ కోమలంచ గ్రామ సర్పంచ్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ స్వచ్చగ్రామంగా నిలిచిన గ్రామాల్లో జూలై 1వ తేదీ నుంచి బహిరంగ మలవిసర్జన చేస్తే 500 రూపాయల జరిమానా విధిస్తామని తీర్మానించారు. ప్రతి కాలనీలో పర్యటించి పైప్‌లైన్‌ …

Read More »

మెను తప్పితే చర్యలు తప్పవు

  నిజాంసాగర్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం విద్యార్థులకు నాణ్యతతో అందించాలని మండల విద్యాధికారి బలిరాం రాథోడ్‌ ఆదేశించారు. మెను తప్పితే చర్యలు తప్పవని అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వపాఠశాలలో, బంజేపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. అనంతరం ఎంఇవో మాట్లాడుతూ పాఠశాలలో తాగునీరు, మూత్రశాలల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం పాఠశాల రిజిష్టర్లు తనిఖీ చేసి ఉపాధ్యాయులు సమయపాలన చేయాలని సూచించారు. సమయ పాలన చేయని …

Read More »

గ్రామాల్లో 40 వేల మొక్కలు నాటించాలి

  నిజాంసాగర్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం పథకం కింద ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో 40వేల మొక్కలకు తగ్గకుండా నాటించాలని ఎంపిడివో రాములు నాయక్‌ ఇజిఎస్‌ అదికారులను ఆదేశించారు. ఎంపిడివో కార్యాలయంలో బుధవారం ఇజిఎస్‌ అధికారులతో సమావేశం అనంతరం మాట్లాడారు. తెలంగాణ హరితహారం పథకంకింద 6 లక్షల 80 వేల మొక్కలు నాటేలా లక్ష్యం పెట్టుకున్నామని, లక్ష్యానికి మించి మొక్కలు నాటేందుకు అదికారులు ప్రత్యేకచొరవ తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 3 లక్షల మొక్కలు నాటడం జరిగిందన్నారు. హరితహారంలో …

Read More »

‘బ్రా’ను కూడా వదల్లేదు!

లండన్‌: సంప్రదాయం పేరుతో వింబుల్డన్‌ నిర్వాహకులు విధిస్తున్న ‘అన్నింటా తెలుపు’ నిబంధన కొన్ని సార్లు పరిధి దాటి ఆటగాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. తాజాగా మాజీ వరల్డ్‌ నంబర్‌వన్, ఐదుసార్లు వింబుల్డన్‌ చాంపియన్‌గా నిలిచిన వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) కూడా ఈ బాధితుల జాబితాలో చేరింది. ఎలిస్‌ మెర్టెన్స్‌తో సోమవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్‌ జరుగుతున్న సమయంలో ఒకసారి ఆమె వేసుకున్న డ్రెస్‌లోంచి గులాబీ రంగు ‘బ్రా’ స్ట్రాప్‌ బయటకు కనిపించింది. ఈ విషయాన్ని …

Read More »

తగ్గుతున్న నల్లకుబేరుల స్విస్‌ సంపద!

సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోప్రత్యేక పర్యవేక్షణ ఫలితమోలేక సుప్రీం ఉత్తర్వులను అనుసరిం చి సిట్‌ ఏర్పాటుచేయడంద్వారా నల్లధనంపై అలుపెర గని పోరువల్లనైతేనేమి విదేశీ బ్యాంకుల్లో దాచుకుంటు న్న నల్లధనం నిల్వలు తగ్గుతున్నాయనే చెప్పాలి. భార తీయులు స్విస్‌బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము గత ఏడా దితో పోలిస్తే భారీగా తగ్గిందని స్వయంగా స్విస్‌ నేష నల్‌ బ్యాంకు వెల్లడించింది. కొందరు పన్నుల ఎగవేత ద్వారా రూటుమార్చి బ్యాంకుల్లో భద్రపరుచుకుంటుంటే మరికొందరు గుప్తధనంపై లెక్కలు చెప్పడం, ఆపై పన్ను లభారంతో సతమతం కాలేక అక్రమమార్గాల్లో ఇతర విదేశీ బ్యాంకులకు మళ్లిస్తున్నారు. …

Read More »