Breaking News

మెను తప్పితే చర్యలు తప్పవు

 

నిజాంసాగర్‌, జూలై 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజనం విద్యార్థులకు నాణ్యతతో అందించాలని మండల విద్యాధికారి బలిరాం రాథోడ్‌ ఆదేశించారు. మెను తప్పితే చర్యలు తప్పవని అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వపాఠశాలలో, బంజేపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. అనంతరం ఎంఇవో మాట్లాడుతూ పాఠశాలలో తాగునీరు, మూత్రశాలల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం పాఠశాల రిజిష్టర్లు తనిఖీ చేసి ఉపాధ్యాయులు సమయపాలన చేయాలని సూచించారు. సమయ పాలన చేయని ఉపాధ్యాయులకు మెమోలు జారీచేస్తామని హెచ్చరించారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *