వ్యవసాయ రంగాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతాం

 

– వ్యవసాయ శాఖ మంత్రి పోచారం

కామారెడ్డి, జూలై 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయరంగాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలుపబోతున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో బుధవారం జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని 473 గ్రామాల్లో వంద క్లస్టర్లలో ఇప్పటివరకు 79.25 శాతం సర్వే నిర్వహించామన్నారు. జిల్లాలో మొత్తం 2,40,028 మంది రైతులుండగా 1,90,255 మంది రైతులను కలిసి వివరాలు సేకరించినట్టు తెలిపారు. మిగిలిన రైతులకు సమాచారం అందించి వారి వివరాలు కూడా నమోదు చేసి సమగ్ర సర్వేను వందశాతం పూర్తిచేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేసినపుడే మంచి పలితాలు అందుతాయన్నారు.

ప్రతి జిల్లానుంచి వందమంది ప్రగతిశీల రైతులను ఎంపిక చేస్తామని, విశ్రాంత వ్యవసాయాధికారులను రిసోర్సు పర్సన్‌లుగా నియమిస్తామని మంత్రి చెప్పారు.రాష్ట్రంలో ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి చొప్పున మొత్తం 2368 మందిని నియమిస్తున్నామన్నారు. ప్రతి ఎఇవోను క్లస్టర్‌గా తీసుకొని ఆ గ్రామంలో అర ఎకర విస్తీర్ణంలో రూ. 15 లక్షలతో రైతు సమావేశమందిరాన్ని గోడౌన్‌ నిర్మిస్తామన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. భూపంపిణీ పథకంపై మంత్రిమాట్లాడుతూ 2014-15 నుంచి 2017-18 వరకు జిల్లాలో 968 ఎకరాలను 680మంది లబ్దిదారులకు పంపిణీ చేశామన్నారు. ఇందుకోసం రూ. 44.66 కోట్లు ఖర్చుచేసినట్టు వెల్లడించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌,జడ్పి ఛైర్మన్‌దఫేదార్‌ రాజు, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, ఎమ్మెల్యే ఏనుగు రవిందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వి.జి.గౌడ్‌, జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులు పాల్గొన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *