Breaking News

Daily Archives: July 7, 2017

రాష్ట్రకార్యవర్గ సమవేశాలు విజయవంతం చేయండి

  కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 8,9 తేదీల్లో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించనున్న టిజివిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు ఎనుగందుల నవీన్‌కోరారు. శుక్రవారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. విద్యారంగ సమస్యల గురించి, కెజి నుంచి పిజి ఉచిత విద్య అమలు గురించి, ప్రయివేటు విద్య కార్పొరేట్‌ విద్యను ప్రోత్సహించడానికి వ్యతిరేకంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో చర్చిస్తామన్నారు. భవిష్యత్‌ కార్యాచరణ, ప్రభుత్వ పాఠశాలల పటిష్టతపై చర్చించి రాష్ట్ర నూతన కమిటీనిఎన్నుకుంటామని తెలిపారు. ...

Read More »

పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి

  కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలను భ్రష్టు పట్టిస్తుందని, పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా స్తానిక ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ తెరాస అధికారంలోకి రాకముందు కెజి నుంచి పిజి ఉచిత విద్య అని చెప్పి ప్రస్తుతం కార్పొరేట్‌ విద్యను ప్రోత్సహిస్తు, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తుందని ఆందోళన ...

Read More »

అక్షర పాఠశాలలో బోనాలపండగ

  కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని అక్షర హైస్కూల్లో శుక్రవారం బోనాల పండగ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రబుత్వం నిర్వహిస్తున్న బోనాల పండగను పురస్కరించుకొని పాఠశాలలో సంప్రదాయ బోనాలను నిర్వహించారు. పోతరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, విద్యార్థులు అందంగా ముస్తాబై బోనాలెత్తుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ అశోక్‌రెడ్డి, కరస్పాండెంట్‌ లోకేశ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ సంగీత, ఇన్‌చార్జి రామ్మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రమాదంలో జర్నలిస్టు మృతి

  కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన జర్నలిస్టు సుభాష్‌ (40) హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఏబిఎన్‌ ఛానల్‌ రిపోర్టర్‌గా పనిచేస్తున్న సుభాష్‌ హైదరాబాద్‌లో రెండు కార్లు ఢీకొన్న సంఘటనలో మృతి చెందాడు. ఆయనతోపాటు కార్లో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలుకాగా హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సుభాష్‌ మృతి పట్ల జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేశారు. జర్నలిస్టు సంఘాలు సుభాష్‌ కుటుంబానికి ...

Read More »

కామారెడ్డిలో చెత్త డబ్బాల పంపిణీ

  కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 19వ వార్డు ముదాం గల్లిలో శుక్రవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా వేసి శుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ శశిరేఖ, పర్యావరణ ఇంజనీరు వెంకట్‌నాయక్‌, యువజన కాంగ్రెస్‌నాయకుడు భూపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

అమర్‌నాథ్‌ యాత్ర ప్రమాదంలో గాంధారి వాసి

  గాంధారి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన బస్సు శ్రీనగర్‌ అనంత్‌నాగ్‌ వద్ద గురువారం ప్రమాదానికి గురైంది. అమర్‌నాథ్‌లో మంచు శివలింగాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా బస్సులో సిలిండర్‌ పేలి ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కామారెడ్డి జిల్లా వాసులు కావడంతో, జిల్లాలోని బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కామారెడ్డి నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు 40 మంది బయల్దేరారు. అక్కడ శివలింగాన్ని దర్శించుకొని వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ...

Read More »

ఎమ్మెల్యేను కలిసి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌

  నందిపేట, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఉల్లి శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం హైదరాబాద్‌ ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెరాస పార్టీలో పార్టీ కొరకు కష్టపడే వారికి పార్టీ గుర్తింపు ఇస్తుందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయకులను గుర్తించి వారికి సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. డైరెక్టర్‌ పదవి పొందిన ఉల్లి శ్రీనివాస్‌గౌడ్‌ ...

Read More »

అభివృద్ధి పనులపై తీర్మానం

  గాంధారి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి గ్రామసభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామస్తుల సమక్షంలో పలు తీర్మానాలు చేశారు. గ్రామజ్యోతిలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను గ్రామసభ ద్వారా పరిష్కరిస్తామన్నారు. గ్రామ సర్పంచ్‌ సత్యం మాట్లాడుతూ గ్రామంలో ఓపెన్‌ బోరుబావులను గుర్తించి మూసివేయడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ నిధులను గ్రామంలో అభివృద్ది పనులకు కేటాయిస్తామన్నారు. పన్నులను వందశాతం వసూలే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇవో పిఆర్‌డి ఆనంద్‌, విఆర్వో ...

Read More »

పార్ట్‌టైమ్‌ అధ్యాపక పోస్టుకు దరఖాస్తు ఆహ్వానం

  గాంధారి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి గురుకుల కళాశాలలో తెలుగు అధ్యాపక పోస్టుకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ గంగాధర్‌నాయక్‌ తెలపారు. పార్ట్‌టైమ్‌ ఉద్యోగానికి దరకాస్తు చేసుకోవాలన్నారు. 10వ తేదీలోపు దరఖాస్తు ఫారంను స్థానిక కళాశాలలో ఇవ్వాలని, డెమో తేది తర్వాత ప్రకటిస్తామన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

Read More »

ప్రణాళికా బద్దంగా హరితహారం

  గాంధారి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమాన్ని ప్రణాళికా బద్దంగా విజయవంతం చేయాలని ప్రత్యేక సమావేశంలో నిర్ణయించారు. శుక్రవారం గాందారి తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ లక్ష్మణ్‌, ఎండివో సాయాగౌడ్‌, ఏపివో నరేందర్‌లతో కలిసి జడ్పిటిసి తానాజీరావు హరితహారంపై సమీక్షించారు. ఈనెల 12న హరితహారం కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కాగా మండలంలో కూడా అదేరోజున ప్రారంభించాలని నిర్ణయించారు. తరువాత 15రోజులపాటు ప్రణాళికలు రూపొందించిమొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామన్నారు. దీనిపై ఈనెల 10న స్థానిక హరాలే గార్డెన్స్‌లో అన్ని ...

Read More »

పాముకాటుతో మహిళ మృతి

  గాంధారి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం గండివేట్‌ గ్రామంలో పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే… గ్రామానికి చెందిన కోలగడ్డ లచ్చవ్వ (40) తన ఇంట్లో పడుకొని ఉండగా గురువారం అర్ధరాత్రి పాముకాటుకు గురైంది. దీంతో హుటాహుటిన బంధువులు, గ్రామస్తులు బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తిరిగి మృతదేహాన్ని బాన్సువాడకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి భర్త పది సంవత్సరాల ...

Read More »