Breaking News

పాముకాటుతో మహిళ మృతి

 

గాంధారి, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం గండివేట్‌ గ్రామంలో పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే… గ్రామానికి చెందిన కోలగడ్డ లచ్చవ్వ (40) తన ఇంట్లో పడుకొని ఉండగా గురువారం అర్ధరాత్రి పాముకాటుకు గురైంది. దీంతో హుటాహుటిన బంధువులు, గ్రామస్తులు బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తిరిగి మృతదేహాన్ని బాన్సువాడకు తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి భర్త పది సంవత్సరాల క్రితం మృతి చెందగా, ఆమెకు ఒక కుమారుడు, కూతురు వుంది. ఇటీవలే కూతురు వివాహం కావడంతో, మిగిలిన కుమారుడు అనాధ అయ్యారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Check Also

ఇందల్వాయి టోల్‌ప్లాజా వద్ద అన్నదానం

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెల్ప్‌ టు అదర్స్‌ సంస్థ ఆద్వర్యంలో ఇందల్వాయి టోల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *