Breaking News

అమర్‌నాథ్‌ యాత్ర ప్రమాదంలో గాంధారి వాసి

 

గాంధారి, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లిన బస్సు శ్రీనగర్‌ అనంత్‌నాగ్‌ వద్ద గురువారం ప్రమాదానికి గురైంది. అమర్‌నాథ్‌లో మంచు శివలింగాన్ని దర్శించుకొని తిరిగి వస్తుండగా బస్సులో సిలిండర్‌ పేలి ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా కామారెడ్డి జిల్లా వాసులు కావడంతో, జిల్లాలోని బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కామారెడ్డి నుంచి అమర్‌నాథ్‌ యాత్రకు 40 మంది బయల్దేరారు. అక్కడ శివలింగాన్ని దర్శించుకొని వస్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో 34 మంది వుండగా, అదే బస్సులో గాంధారికి చెందిన వెంకట్‌గౌడ్‌ దంపతులు వున్నారు. ఒక్కసారిగా బస్సు ప్రమాదానికి గురైందని వెంకట్‌గౌడ్‌ కాలు విరిగిందని బందువులు తెలిపారు. మిగతా వారిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. యాత్రకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి రావాలని అక్కడే ప్రమాదానికి గురైన వారి బందువులు దేవున్ని ప్రార్థిస్తున్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article