Breaking News

ఎమ్మెల్యేను కలిసి మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌

 

నందిపేట, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ ఉల్లి శ్రీనివాస్‌గౌడ్‌ శుక్రవారం హైదరాబాద్‌ ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెరాస పార్టీలో పార్టీ కొరకు కష్టపడే వారికి పార్టీ గుర్తింపు ఇస్తుందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నాయకులను గుర్తించి వారికి సరైన న్యాయం చేయాలనే ఉద్దేశంతో పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. డైరెక్టర్‌ పదవి పొందిన ఉల్లి శ్రీనివాస్‌గౌడ్‌ తరఫున గౌడ సంఘం సభ్యులు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను నెరవేర్చి పార్టీ పటిష్టతకు నందిపేట మండల రైతుల శ్రేయస్సుకు కృషి చేస్తానన్నారు. ఆయన వెంట రాజుగౌడ్‌, నారాగౌడ్‌, నక్కల భూమేశ్‌, ప్రవీణ్‌గౌడ్‌, అహ్మద్‌ఖాన్‌, తదితరులున్నారు.

Check Also

రాజ్యసభ సభ్యులు సురేశ్‌రెడ్డి మొక్కలు నాటారు…

హైదరాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ...

Comment on the article