Breaking News

అభివృద్ధి పనులపై తీర్మానం

 

గాంధారి, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి గ్రామసభ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలో పలు అభివృద్ధి పనులపై చర్చించారు. గ్రామస్తుల సమక్షంలో పలు తీర్మానాలు చేశారు. గ్రామజ్యోతిలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను గ్రామసభ ద్వారా పరిష్కరిస్తామన్నారు. గ్రామ సర్పంచ్‌ సత్యం మాట్లాడుతూ గ్రామంలో ఓపెన్‌ బోరుబావులను గుర్తించి మూసివేయడం జరుగుతుందన్నారు. గ్రామ పంచాయతీ నిధులను గ్రామంలో అభివృద్ది పనులకు కేటాయిస్తామన్నారు. పన్నులను వందశాతం వసూలే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇవో పిఆర్‌డి ఆనంద్‌, విఆర్వో హుస్సేన్‌, అంగన్‌వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article