Breaking News

పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి

 

కామారెడ్డి, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలను భ్రష్టు పట్టిస్తుందని, పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీగా స్తానిక ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ తెరాస అధికారంలోకి రాకముందు కెజి నుంచి పిజి ఉచిత విద్య అని చెప్పి ప్రస్తుతం కార్పొరేట్‌ విద్యను ప్రోత్సహిస్తు, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేటు పాఠశాలలోఫీజులు నియంత్రించాలని, ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు శివకృష్ణ, రాజు, నవీన్‌, సతీస్‌, ప్రదీప్‌, నవనీత్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article