Breaking News

Daily Archives: July 8, 2017

ఘనంగా గురుపూజోత్సవం

  కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురుపూర్ణిమను పురస్కరించుకొని శనివారం అవార్డి టీచర్స్‌ అసోసియేషన్‌ ఎటిఎ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాకేంద్రంలో పలువురు రిటైర్డ్‌ ఉపాధ్యాయులను, ఉపాద్యాయులను సన్మానించారు. ఎన్‌జివోస్‌ కాలనీలోని రామాలయంలో శాస్త్రుల పాండురంగ శర్మ, నటేశ్వర శర్మ, కేదారనాథ శర్మ, సేనాపతి, కృష్ణప్రసాద్‌, గంగాకిషన్‌, అర్జున్‌రావులను సన్మానించారు. కార్యక్రమంలో ఆటాప్రతినిధులు సుధాకర్‌శర్మ, బ్రాహ్మణ వికాస పరిషత్‌ అధ్యక్షుడు వైద్య కిషన్‌రావు, ఆలయ కమిటీ సభ్యులు విజయ్‌కుమార్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

పశువులకు మేత హరితహారం మొక్కలు

  నిజాంసాగర్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ, పల్లె ప్రాంతాలను పచ్చ అందాలతో నింపి ఆరోగ్యకర వాతావరణాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలు వెచ్చించి చేపట్టిన హరితహారం పథకం నిజాంసాగర్‌ మండలంలో నీరుగారిపోతుంది. ఖరీదైన వేలాది మొక్కలను పనికి రాకుండా అధికారులు వృదాగా పారవేశారు. మరికొన్నింటిని పశువులకు మేతగా వేశారు. అడిగేవారు లేనట్టుగా మొక్కలకు జీవం పోస్తూనే నిర్జీవం చేశారు. నర్సరీ నుంచి పంట పొలాలకు గట్లలో తరలించి అక్కడే వదిలేశారు. ప్రతి మొక్కకు లెక్కచూపాల్సి ఉంటుందని ...

Read More »

గున్కుల్‌లో ఊరపండగ

  నిజాంసాగర్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని గున్కుల్‌ గ్రామంలో ఊరపండగను ఘనంగా నిర్వహించారు. శనివారం గ్రామంలోని మహిళలు అందంగా అలంకరించిన బోనాలను నెత్తినెత్తుకొని ఊరేగింపుగా గ్రామ శివారులోని ఆలయం వద్దకు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.

Read More »

చెరువు పనులు పరిశీలన

  నిజాంసాగర్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నర్వా గ్రామంలో కొనసాగుతున్న కోమటికుండ చెరువు పనులను నాణ్యత నియంత్రణ శాఖాధికారులు ఏ.ఇ. అవినాష్‌ పరిశీలించారు. మిషన్‌ కాకతీయ మూడో విడతలో చెరువుల పూడికతీత పనుల కోసం రూ. 16 లక్షలు మంజూరయ్యాయని, పనులు నాణ్యతగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ ఎ.ఇ. బాసిద్‌, వర్కింగ్‌ ఇన్స్‌పెక్టర్‌ కాశీనాథ్‌, నాయకులు దఫేదార్‌ విజయ్‌, తదితరులు ఉన్నారు.

Read More »

కరెంటు మరణాలకు బాధ్యులెవరు

  నందిపేట, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాకాలంలో విద్యుత్‌ ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకునే బాధ్యత విద్యుత్‌ అధికారులపై ఉన్నప్పటికి వారి నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు, జీవాలు బలవుతున్నాయి. శనివారం మండలంలోని బాద్గుణ గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌కు కంచెలేకపోవడంతో విద్యుత్‌ షాక్‌కు గురై గేదె మృతి చెందింది. వర్సాకాలం ప్రారంభం జూన్‌ నుంచి మండలంలోని షాపూర్‌, జిజినడ్కుడ, నందిపేటలో ముగ్గురు విద్యుత్‌ షాక్‌తో మృత్యువాతపడ్డారు. అదేవిధంగా తొండాకూర్‌, కుదావన్‌పూర్‌ గ్రామాలలో, తాజాగా శనివారం బాద్గుణ గ్రామంలో విద్యుత్‌ షాక్‌తో గేదెలు ...

Read More »

కష్టపడి పనిచేసేవారికే పదవులు

  నందిపేట, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ఉద్యమంలో సేవలందించి తెరాస పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయని ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. నందిపేట మండల కేంద్రానికి చెందిన సిలిండర్‌ లింగం ఇటీవల నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఆయన స్థానిక తెరాస నాయకులతో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లింగం పార్టీ స్థాపన నుంచి సేవలందిస్తున్నారని, ఆయన ...

Read More »

జలప్రదాత వైఎస్‌ఆర్‌

  నందిపేట, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆద్వర్యంలో కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ 68వ జయంతి సందర్భంగా వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల పార్టీ అద్యక్షుడు బండి నర్సాగౌడ్‌ మాట్లాడుతూ జలయజ్ఞం, ఫీజు రీయంబర్స్‌మెంట్‌, 108 సేవలు, ఆరోగ్యశ్రీ, ముస్లింలకు4 శాతం రిజర్వేషన్‌ లాంటి పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వ్యక్తి వైఎస్‌ఆర్‌అని కొనియాడారు. వ్యవసాయమే ఆధారంగా ఉన్న నందిపేట మండలానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌తో అనుబంధ ...

Read More »