Breaking News

Daily Archives: July 9, 2017

అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాలు వదిలిన చెత్తా చెదారాన్ని ఎలా తొలగిస్తారు?

అంతరిక్షంలో కాలం చెల్లిన ఉపగ్రహాల చెత్తా చెదారం విషయంలో ‘చికిత్స కన్నా నివారించడమే మేలు’ అనే సూత్రాన్ని పాటించడం మంచిదని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. అందువల్ల వారు ఉపగ్రహ ప్రయోగంలోనే దాని వల్ల ఏర్పడే అనవసర పదార్థాల్ని (జంక్‌) తొలగించే ఏర్పాటు చేస్తారు. ఒక ఉపగ్రహం జీవిత కాలం ముగియగానే అది తన కక్ష్య నుంచి తప్పుకుని భూమివైపు పయనించే ఏర్పాటు చేస్తారు. అలా కాలం చెల్లిన ఉపగ్రహం భూవాతావరణంలోకి ప్రవేశించి అక్కడి వాయువులతో ఘర్షణ ఏర్పడి మాడి మసైపోతుంది. అంతరిక్షంలో ఉపగ్రహాల వల్ల ఏర్పడిన ...

Read More »

ఘనంగా వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు

  కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతిని శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయ ఆవరణలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాలలువేసి నివాలులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలకు రైతులకు పావలా వడ్డి రుణాలు, 108 అంబులెన్సులు, ఆరోగ్యశ్రీ, తాగునీరు, సాగునీరుకోసం పథకాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను బడుగు, బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన మహనీయుడు రాజశేఖర్‌రెడ్డి అని కొనియాడారు. కార్యక్రమంలో ...

Read More »

కార్యవర్గ సమావేశాలకు టిజివిపి విద్యార్థులు

  కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహిస్తున్న టిజివిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు జిల్లాలోని టిజివిపి నాయకులు శనివారం తరలివెళ్లారు. సమావేశాల్లో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎనుగందుల నవీన్‌తోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. సమావేశాల్లో ప్రభుత్వపాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటి పరిష్కారం, ప్రయివేటు విద్యకు వ్యతిరేకంగా పోరాటం, తదితర విషయాలపై చర్చించినట్టు తెలిపారు. అనంతరం టిజివిపి రాష్ట్ర కమిటీని ఎన్నుకుంటారని తెలిపారు.

Read More »

రుణాల మంజూరుతో పేదల జీవితాల్లో వెలుగు నింపాలి

  కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులకు సకాలంలో రుణాలు అందించి వారిజీవితాల్లో వెలుగు నింపాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన రైతుల, పేదల అభ్యున్నతికై బ్యాంకు మేనేజర్ల సహృదయ, ఆత్మీయ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. సమాజ ప్రగతిలో బ్యాంకులదే కీలక పాత్ర అన్నారు. బ్యాంకు మేనేజర్లు పేదవారికి సహయం చేసే స్థితిలో ఉండడం వారిఅదృష్టమని, సహృదయంతో వ్యవహరించి రునాలు మంజూరు ...

Read More »

మిషన్‌ భగీరథ లక్ష్యాన్ని అక్టోబర్‌నాటికి పూర్తిచేయాలి

  – వ్యవసాయ శాఖ మంత్రి పోచారం కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మిషన్‌ భగీరథ లక్ష్యాన్ని నిర్దేశించుకొని అక్టోబర్‌ నాటికి పనులు పూర్తిచేసేవిధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మిషన్‌ భగీరథ పనుల పురోగతిపై అదికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో శనివారం జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెయిన్‌ పైప్‌లైన్‌ పనులు మంచి పురోగతిలో ఉన్నాయని, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సివిల్‌ వర్క్స్‌ నిర్మాణం ...

Read More »

తపస్‌ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం

  కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇఎస్‌ఆర్‌ గార్డెన్‌లో శనివారం తపస్‌ ఆద్వర్యంలో గురుపూర్ణిమను పురస్కరించుకొని గురుపూజోత్సవం నిర్వహించారు. దీనికి కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఓయు విశ్రాంత ఉపన్యాసకుడు హన్మంత్‌రావు, డిఇవో మదన్‌మోహన్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగాజిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు మనోవైజ్ఞానిక, సానుకూల, మానసిక వికాసం కలిగించే ఆలోచనలు చేయాలన్నారు. తనకు బోధించిన గురువులు వేదికపై ఉన్నారని, వారి వల్లే తాను ఐఏఎస్‌ కాగలిగానని, గురువులు కసిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ...

Read More »