Breaking News

ఎస్పీ కార్యాలయంలో హరితహారం

 

కామారెడ్డి, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మూడో విడత హరితహారంలోభాగంగా బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 75 మొక్కలు నాటారు. జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డితోపాటు సిబ్బంది మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మన పెద్దలు ప్రకృతికి అనుకూలంగా నడిచారని, పర్యావరణం కాపాడారన్నారు. ప్రస్తుతం ప్రకృతి వ్యతిరేకంగా నడుచుకుంటూ అనేక అవస్థలు పడుతున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలునాటి పర్యావరణ సమతుల్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

Check Also

కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 33 వేల బతుకమ్మ చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *