Breaking News

చెట్లతోనే మానవాళి మనుగడ

 

– జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ

గాంధారి, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెట్లతోనే మానవాళి మనుగడ అని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అన్నారు. బుధవారం హరితహరం కార్యక్రమాన్ని గాంధారి మండలంలో మొక్కలునాటి ప్రారంభించారు. మండలంలోని మాదవ్‌పల్లిలో మొక్కలునాటి నీరుపోశారు. అందరిచేత మొక్కలు నాటించారు. గ్రామంలో ప్రతి ఒక్కరు 5 మొక్కల చొప్పున నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. చెట్ల ఆవశ్యకత మానవాళికి ఎంత అవసరమో వివరించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసుపత్రికి ప్రహరీ గోడ ఉన్నందున ఆవరణలో నాటిన మొక్కలు నూటికి నూరుశాతం బతికేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

హరితహారంలో అందరు భాగస్వాములు కావాలన్నారు. అటవీశాఖ, రెవెన్యూ, మండల పరిసత్‌, ఉపాధి హామీ, ఐకెపి, సాక్షరభారతి, అంగన్‌వాడి, ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు. సమన్వయంతో, సమష్టి కృషితో పనిచేయడం వల్ల అలసట వుండదని, మొక్కలు తమ సొంత పిల్లల్లా చూసుకోవాలన్నారు. 15 రోజులపాటు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు, ఆలయాలు, రోడ్డుకు ఇరువైపులా మొక్కలునాటాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి చంద్రమోహన్‌రెడ్డి, జడ్పిటిసి తానాజీరావు, ఎంపిపి యశోదాబాయి, ఎండివో సాయాగౌడ్‌, తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌, ఎఫ్‌ఆర్‌వో భాయసాబ్‌, సర్పంచ్‌ సత్యం, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.

Check Also

పూరి వర్గాన్నే టార్గెట్ చేశారా?

హైదరాబాద్: సినిమా ఇండ్రస్టీ అంటేనే ఓ మాయా జగత్తు. సింగిల్ నైట్లో స్టార్స్ అయిపోవచ్చు. సింగిల్ డేలో రోడ్డుపైకి వచ్చేయచ్చు. ఒక్క …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *