Breaking News

Daily Archives: July 15, 2017

చురుకుగా సాగుతున్న హరితహారం

  నందిపేట, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానలు వాపసు రావాలి… కోతులు వాపసు పోవాలి.. అనే నినాదంతో పాటు రాష్ట్రంలో 24 నుంచి 33 శాతం పచ్చదనాన్ని సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం నందిపేట మండలంలో విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని హారంగా మార్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రణాళిక ఇక్కడి మండల అధికారులు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమం గత రెండేళ్ళుగా పెద్ద ఎత్తున సాగుతుంది. ...

Read More »

అయ్యా.. ఈ రోడ్డుపై ప్రయాణం చేసేదెట్లా….

  నందిపేట, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో రోడ్డు గుండా ప్రయాణం చేయలేక వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళలో రోడ్డు ప్రయాణం చేసిన పలువురు వాహన చోదకులు రోడ్డుపై ఉన్న గుంతల్లో పడి తీవ్ర గాయాలైన సంఘటనలున్నాయి. ముఖ్యంగా అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఎన్నిసార్లు తాత్కాలిక మరమ్మతులు చేసినా రెండు మూడురోజులకే మళ్లీ ...

Read More »

మొక్కలను ప్రతి ఒక్కరు బాధ్యతతో నాటాలి

  నందిపేట, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూమిలో తేమశాతం పెరగాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలునాటి సంరక్షించుకోవాలని నందిపేట మండల అభివృద్ది అధికారి నాగవర్దన్‌ అన్నారు. మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని డొంకేశ్వర్‌ ఉన్నత పాఠశాలలో శనివారం తహసీల్దార్‌ ఉమాకాంత్‌తో కలిసి మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం మానవాళికి సరిపడ చెట్లు లేకపోవడంతో వాతావరణంలో వేడిమి పెరుగుతుందన్నారు. ప్రకృతి సరిగా ఉంటేనే వర్షాలు సరైన సమయంలో కురుస్తాయని తెలిపారు. గత సంవత్సరం ...

Read More »

హరితహారం వేగవంతం చేయాలి

  నిజాంసాగర్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో నాటుతున్న మొక్కలు వేగవంతంగా పూర్తిచేయాలని ఎంపిడివో రాములు నాయక్‌ తెలిపారు. మండలంలోని కోమలంచ గ్రామంలో హరితహారం మొక్కలను పాఠశాల ఆవరణలో శనివారం నాటి నీరుపోశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మొక్కలు సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రతిఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ప్రతిగ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలు నాటే లక్ష్యంగా ఉందని, లక్ష్యానికి మించి మొక్కలు నాటేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ...

Read More »

మధ్యాహ్న భోజనం తనిఖీ

  నిజాంసాగర్‌, జూలై 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెను ప్రకారం భోజనం అందించాలని ఎంఇవో బలిరాం రాథోడ్‌ అన్నారు. నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల తనికీ చేశారు. అనంతరం మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని, రుచికరమైన భోజనాన్ని విద్యార్థులకు వండి పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. మధ్యాహ్న భోజనం స్వయం భుజించి రుచిచూశారు. కార్యక్రమంలో ఉపాద్యాయురాలు సంద్యారాణి, ఉపాధ్యాయులు భూమయ్య, జైల్‌సింగ్‌, తదితరులున్నారు.

Read More »

పూరి వర్గాన్నే టార్గెట్ చేశారా?

హైదరాబాద్: సినిమా ఇండ్రస్టీ అంటేనే ఓ మాయా జగత్తు. సింగిల్ నైట్లో స్టార్స్ అయిపోవచ్చు. సింగిల్ డేలో రోడ్డుపైకి వచ్చేయచ్చు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆ తర్వాత లైఫ్ మారిపోతుంది. అప్పటి దాకా ఉండే సర్కిల్ మారిపోతుంది. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. కార్లు, ఫారెన్ ట్రిప్స్, లేట్ నైట్ పార్టీస్, మీటింగ్స్, షూటింగ్స్ ఇలా స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. చుట్టూ ఎన్నో కొత్తగా వచ్చి చేరిపోతాయి. వీటికి తోడు జనం ఎక్కడికి వెళ్లిన ఎగబడి చూస్తారు. ఒక్కసారి వచ్చిపడే స్టార్‌డమ్ కిక్ ...

Read More »

సెక్స్‌ గురించి సమంత బోల్డ్‌ స్టేట్‌మెంట్‌!

త్వరలోనే అక్కినేని నాగచైతన్యతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సమంత తనలోని బోల్డ్‌నెస్‌ను మాత్రం ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. హాట్‌హాట్‌ ఫోటోషూట్లతో గ్లామర్‌ విందు చేస్తోంది. తాజాగా జేఎఫ్‌డబ్ల్యూ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెక్స్‌ గురించి బోల్డ్‌ కామెంట్స్‌ చేసింది ఈ చెన్నై చిన్నది. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మీరు దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.. శృంగారానికా? ఆహారానికా?’ అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘సెక్స్‌కే నా మొదటి ప్రాధాన్యం’ అని డేరింగ్‌గా సమాధానమిచ్చింది. అంతేకాకుండా ‘ఆహారం తినకుండా ఒక రోజు ...

Read More »

చుక్కలు చూపిస్తున్న ఓలా డ్రైవర్‌

ఓలాకు ఫోన్‌ చేసి.. మొబైల్‌ ఆఫ్‌ చేసి… రోజుకో సిమ్‌ మారుస్తూ ఒక్కోచోట నుంచి ఫోన్‌ సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులకే సవాల్‌ 9 రోజులవుతున్నా దొరకని శ్రీకాంత్‌ జాడ న్యూఢిల్లీ, గద్వాల: పోలీసింగ్‌లో నంబర్‌వన్‌ అంటే ఢిల్లీ పోలీసులని చెబుతారు. అంతటి పోలీసులకే ఓ ఓలా డ్రైవర్‌ చుక్కలు చూపిస్తున్నాడు. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. తూర్పు ఢిల్లీ జిల్లాలోని 90 శాతం మంది పోలీసులు కేవలం గద్వాలకు చెందిన డాక్టర్‌ శ్రీకాంత్‌ను కిడ్నాప్‌ చేసిన ఓలా డ్రైవర్‌ను పట్టుకునే పనిలోనే ఉన్నారంటే ...

Read More »

50 ఏళ్లొచ్చినా పిల్లల్ని కనొచ్చు!

బోస్టన్‌ :మెనోపాజ్‌(మహిళల్లో రుతుక్రమం ఆగిపోవటం) దశ వస్తే పిల్లల్ని కనడం అసాధ్యం. అయితే, 50 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనాలని కొందరు ఆశపడుతుంటారు. దానికోసం అమెరికాలోని మాస్సాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌ కేన్సర్‌ సెంటర్‌ పరిశోధకులు ‘అండాశయ కణజాల ఘనీభవనం’ పద్ధతిని కనిపెట్టారు. ప్రయోగ దశలో ఉన్న ఈ పద్ధతి పిల్లల్ని కనాలనుకునే మహిళలకు అనుకూలంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

Read More »