Breaking News

పూరి వర్గాన్నే టార్గెట్ చేశారా?

హైదరాబాద్: సినిమా ఇండ్రస్టీ అంటేనే ఓ మాయా జగత్తు. సింగిల్ నైట్లో స్టార్స్ అయిపోవచ్చు. సింగిల్ డేలో రోడ్డుపైకి వచ్చేయచ్చు. ఒక్క సినిమా హిట్ అయితే చాలు ఆ తర్వాత లైఫ్ మారిపోతుంది. అప్పటి దాకా ఉండే సర్కిల్ మారిపోతుంది. లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. కార్లు, ఫారెన్ ట్రిప్స్, లేట్ నైట్ పార్టీస్, మీటింగ్స్, షూటింగ్స్ ఇలా స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. చుట్టూ ఎన్నో కొత్తగా వచ్చి చేరిపోతాయి. వీటికి తోడు జనం ఎక్కడికి వెళ్లిన ఎగబడి చూస్తారు. ఒక్కసారి వచ్చిపడే స్టార్‌డమ్ కిక్ అంతా ఇంతా కాదు. క్రాప్ చెదిరిపోకుండా, ముఖం వాడిపోకుండా పర్యవేక్షించే పది రకాల సిబ్బంది. కారు దిగితే స్టార్ హోటల్, విమానం ఎక్కితే విదేశాల్లో ల్యాండింగ్. వీటన్నింటికీ తోడు చుట్టూ పొగడ్తలతో ముంచెత్తే భజనపరులు. అంతేనా డబ్బుకు ఏ లోటు రాదు. ఇది సినిమా లైఫ్.
‘ఇడియట్’ సినిమా తర్వాత దర్శకుడు పూరిజగన్నాథ్‌ను కూడా ఇండ్రస్టీ ది డైరెక్టర్ అనేసింది. బద్రి, ఇడియట్, అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, శివమణి, పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇలా చాలా హిట్స్‌తో ఉన్న పూరి స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. ఇప్పటికీ సమీప గతంలో హిట్స్ లేవుకానీ పూరి అంటే స్థిరపడిపోయిన బ్రాండ్ మాత్రం ఉంది. ఆయన చుట్టూ ఉన్న వలయం అలాగే ఉంది. తాజాగా డ్రగ్స్ కేసులో లిస్టవుటయిన పేర్లన్నీ పూరి కంపెనీలోని వారివి కావడం ప్రధానంగా గమనించాల్సిన అంశం.
డ్రగ్స్ కేసులో చార్మీ పేరు బయటకు రాగానే అయ్యో ఈ పిల్లకు ఏం అయింది అని అనుకోని వారుండరు. ఏమి కాలేదు చేతిలో సినిమాలు లేవు అంతే. 13 ఏళ్లకే సినిమా ఇండ్రస్టీలోకి వచ్చిన చార్మీ చార్మింగ్ లుక్స్, అదిరిపోయే స్క్రీన్ ప్రజెంటేషన్స్‌తో పాటు మంచి నటి గానూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు బిజీ స్టార్ సినిమాలకు తోడు షాప్స్ ఓపెనింగ్, మూవీ ఈవెంట్స్‌లోనూ బిజీగా ఉండే హీరోయిన్. కథానాయిక ప్రాధాన్యత ఉన్న మంత్ర, అనుకోకుండా ఒకరోజు లాంటి సినిమాలతో ప్రతిభ చాటింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోయిన తర్వాత ఐటమ్ సాంగ్స్ కూడా చేసింది. జ్యోతిలక్ష్మి సినిమాతో ప్రొడ్యూసర్‌గా మారిన చార్మి ఆ మూవీలో టైటిల్ రోల్ తర్వాత పూర్తిగా తెరమరుగైంది. ప్రొడ్యూసర్‌గా కొత్త కెరీర్ ప్రారంభించిదనుకున్న సమయంలో డ్రగ్స్ కేసులో చార్మీ పేరు బయటికి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Check Also

భోజన వసతి కల్పించాలి

  నిజామాబాద్‌ టౌన్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుకుంటున్న నిరుద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *