Breaking News

మొక్కలను ప్రతి ఒక్కరు బాధ్యతతో నాటాలి

 

నందిపేట, జూలై 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూమిలో తేమశాతం పెరగాలంటే ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలునాటి సంరక్షించుకోవాలని నందిపేట మండల అభివృద్ది అధికారి నాగవర్దన్‌ అన్నారు. మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని డొంకేశ్వర్‌ ఉన్నత పాఠశాలలో శనివారం తహసీల్దార్‌ ఉమాకాంత్‌తో కలిసి మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం మానవాళికి సరిపడ చెట్లు లేకపోవడంతో వాతావరణంలో వేడిమి పెరుగుతుందన్నారు. ప్రకృతి సరిగా ఉంటేనే వర్షాలు సరైన సమయంలో కురుస్తాయని తెలిపారు. గత సంవత్సరం మండలంలో 11 లక్షలు మొక్కలు నాటామని, ఈయేడు కూడా అంతే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ హరిదాస్‌, తెరాస గ్రామాధ్యక్షుడు మిట్టాపల్లి మల్లారెడ్డి, నాయకులు గోపిగౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సెక్స్‌ గురించి సమంత బోల్డ్‌ స్టేట్‌మెంట్‌!

త్వరలోనే అక్కినేని నాగచైతన్యతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సమంత తనలోని బోల్డ్‌నెస్‌ను మాత్రం ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. హాట్‌హాట్‌ ఫోటోషూట్లతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *