Breaking News

చురుకుగా సాగుతున్న హరితహారం

 

నందిపేట, జూలై 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వానలు వాపసు రావాలి… కోతులు వాపసు పోవాలి.. అనే నినాదంతో పాటు రాష్ట్రంలో 24 నుంచి 33 శాతం పచ్చదనాన్ని సాధించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం నందిపేట మండలంలో విజయవంతంగా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని హారంగా మార్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రణాళిక ఇక్కడి మండల అధికారులు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో హరితహారం కార్యక్రమం గత రెండేళ్ళుగా పెద్ద ఎత్తున సాగుతుంది.

12 జూలై నుంచి ప్రారంభమైన మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని గురువారం నందిపేట మండల కేంద్రంలోని పలుగ్గుట్ట ప్రాంతంలో ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎంపి కవిత, ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పాల్గొని ఈతవనాలు నాటారు. అదేవిధంగా శాంతిభద్రతలు కాపాడే పోలీసు డిపార్టుమెంట్‌ సైతం సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి గత సంవత్సరం పదివేల మొక్కలు నాటారు. ఈయేడు కూడా హరితహారంలో ముందుండాలనే ఉద్దేశంతో గురువారం పోలీసు స్టేషన్‌ ఆవరణలో ఏసిపి శివకుమార్‌, సిఐ లక్ష్మినరసింహస్వామి మొక్కలునాటి నీరుపోశారు. నందిపేటలో ప్రజలకు మామిడి మొక్కలు పంపిణీ చేశారు.

Check Also

కామారెడ్డి జిల్లాలో 2 లక్షల 33 వేల బతుకమ్మ చీరల పంపిణీ

  కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2 లక్షల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *