Breaking News

హరితహారం వేగవంతం చేయాలి

 

నిజాంసాగర్‌, జూలై 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో నాటుతున్న మొక్కలు వేగవంతంగా పూర్తిచేయాలని ఎంపిడివో రాములు నాయక్‌ తెలిపారు. మండలంలోని కోమలంచ గ్రామంలో హరితహారం మొక్కలను పాఠశాల ఆవరణలో శనివారం నాటి నీరుపోశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ మొక్కలు సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రతిఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. ప్రతిగ్రామ పంచాయతీకి 40 వేల మొక్కలు నాటే లక్ష్యంగా ఉందని, లక్ష్యానికి మించి మొక్కలు నాటేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సాదుల సత్యనారాయణ, ఉపాధ్యాయులు తదితరులున్నారు.

Check Also

ఎంబిసి వర్గాల సమస్యల పరిష్కారానికి ఉద్యమం

  కామారెడ్డి, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంబిసి వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *