Breaking News

అయ్యా.. ఈ రోడ్డుపై ప్రయాణం చేసేదెట్లా….

 

నందిపేట, జూలై 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో రోడ్డు గుండా ప్రయాణం చేయలేక వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళలో రోడ్డు ప్రయాణం చేసిన పలువురు వాహన చోదకులు రోడ్డుపై ఉన్న గుంతల్లో పడి తీవ్ర గాయాలైన సంఘటనలున్నాయి. ముఖ్యంగా అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఎన్నిసార్లు తాత్కాలిక మరమ్మతులు చేసినా రెండు మూడురోజులకే మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయి. గత్యంతరం లేని పరిస్థితిలో ప్రజలు రోడ్డు గుండా ప్రయాణించాల్సి వస్తుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూన్నాళ్ళ ముచ్చటగా కాకుండా శాశ్వత పరిష్కారంతో రోడ్డు మరమ్మతులు చేసి నీరు నిలువకుండా రోడ్డుపక్కన మురికి కాలువలు ఏర్పాటు చేసి రోడ్డు బాగుచేయాలని ప్రజలు కోరుతున్నారు.

Check Also

సెక్స్‌ గురించి సమంత బోల్డ్‌ స్టేట్‌మెంట్‌!

త్వరలోనే అక్కినేని నాగచైతన్యతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సమంత తనలోని బోల్డ్‌నెస్‌ను మాత్రం ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. హాట్‌హాట్‌ ఫోటోషూట్లతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *