Breaking News

చేతి వేళ్లలో ఆ శబ్దమేల?

రెండు అర చేతుల్నీ దండం పెడుతున్నట్లు ఆనించి గట్టిగా ఒత్తితే అర చేతులు పుటాకారంలో ఉంటాయి. కాబట్టి మధ్యలో ఇరుక్కున్న గాలి చిన్న సంధుల్లో నుంచి అధిక పీడనంతో రావడం వల్ల ‘పుస్‌’ అంటూ ఈలలా శబ్దం వస్తుంది. ఇది ఒక రకం. మీరన్న వేళ్లను ఒత్తినప్పుడు వచ్చే శబ్దాన్ని మెటికలు విరవడం అని కూడా అంటారు. చేతి వేళ్లు కీళ్లతో ఉండటం వల్ల వాటిని ఎటైనా వంచగలం. రోజూ వారీ వేళ్లు కదులుతుండటం వల్ల కీళ్లు, ఎముకల మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఈ ఘర్షణ వల్ల కీళ్ల దగ్గర ఉన్న కందెనలాంటి ద్రవంలోని నీరు కొద్దిగా ఆవిరై అక్కడే చిన్న పాటి నీటి బుడగలు ఏర్పడతాయి. ఆ బుడగలు కీళ్ల మధ్య ఇరుక్కుని ఉంటాయి. మనం మెటికలు విరిచినప్పుడు (వేళ్లను ప్రత్యేకంగా వంచినప్పుడు) దాగున్న ఆ నీటి బుడగలు బయటపడి చిట్లుతాయి. ఆ శబ్దాలే మెటికల శబ్దాలు.

Check Also

సెక్స్‌ గురించి సమంత బోల్డ్‌ స్టేట్‌మెంట్‌!

త్వరలోనే అక్కినేని నాగచైతన్యతో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సమంత తనలోని బోల్డ్‌నెస్‌ను మాత్రం ఏమాత్రం తగ్గించుకోవడం లేదు. హాట్‌హాట్‌ ఫోటోషూట్లతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *