Breaking News

Daily Archives: July 19, 2017

పాలకుల తీరుకు నిరసనగా శుక్రవారం బంద్‌

  గాంధారి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంప పాలకుల తీరుకు నిరసనగా శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చినట్టు అఖిలపక్ష నాయకులు తెలిపారు. బుధవారం గాంధారి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గాంధారి మండల కేంద్రంలో ఎక్కడ చూసినా పారిశుద్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. రోడ్డుకు ఇరువైపులా మురికినీరు దర్శనమిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాందారిని పాలకులు పూర్తిగా విస్మరిస్తున్నారని, నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే గాంధారి అతి పెద్ద …

Read More »

రెవెన్యూ రికార్డుల పరిశీలన

  గాంధారి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండలంలో రెవెన్యూ రికార్డులను ఇంటింటికి వెళ్లి పరిశీలిస్తున్నట్టు తహసీల్దార్‌ ఎస్‌.వి.లక్ష్మణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మండలంలోని రాంలక్ష్మణ్‌పల్లి, గొల్లాడి, నర్సాపూర్‌ గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేలో ఆయన పాల్గొన్నారు. రెవెన్యూ శాఖలో వున్న రికార్డుల వివరాలు వ్యవసాయదారుల వివరాలు లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి విఆర్వోలు, అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. మండల అధికారులు, విఆర్వోలు మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రతిఇంటికి వెళ్లి వారికి సంబంధించిన భూమి పాస్‌ పుస్తకాలు పరిశీలిస్తారని ప్రజలు …

Read More »

మొక్కల సంరక్షణకు కృషి చేయాలి

  నిజాంసాగర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలను విరివిగా నాటి సంరక్షించాలని ఎంపిడివో రాములు నాయక్‌ అన్నారు. మండలంలోని ఆరేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోసి ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో ఖాళీ స్థలంలో వందమొక్కలు నాటినట్టు తెలిపారు. అలాగే సుంకిపల్లి నర్సరీలో పంపిణీ చేస్తున్న మొక్కలను పరిశీలించారు. సరిపడ మొక్కలను ట్రాక్టర్లలో, ఆటోల్లో తరలించి సరిగా నాటాలని సూచించారు. కార్యక్రమంలో ఎపివో సుదర్శన్‌ తదితరులున్నారు.

Read More »

నిజాంసాగర్‌లోకి 232 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

  నిజాంసాగర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్టు జలాశయంలోకి రెండుమూడురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 232 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు డిఇ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా, బాచపల్లి, రాంరెడ్డిపేట్‌, నిజాంపేట్‌, శంకరంపేట్‌ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షపు వరదనీరు వచ్చి ప్రాజెక్టులోకి స్వల్పంగా చేరుతుందన్నారు. సింగూరు ప్రాజెక్టు జలాశయంలోకి కురుస్తున్న భారీ వర్షాలకు 1813 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుందని తెలిపారు. సింగూరు ప్రాజెక్టు ఎగువ ప్రాంతమైన కర్ణాటక, …

Read More »