Breaking News

Daily Archives: July 20, 2017

పోలీసుశాఖ ఆద్వర్యంలో 87 వేల మొక్కలు

  కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మూడో విడత హరితహరంలో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 87 వేల 333 మొక్కలు నాటినట్లు ఎస్‌పి శ్వేతారెడ్డి తెలిపారు. జిల్లాలోని 27 గ్రామాల్లో గురువారం 60 వేల 353 మొక్కలు నాటినట్లు తెలిపారు. ఈనెల 22, 24 తేదీల్లో మిగతా దత్తత గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. పోలీసులు, సిబ్బంది విరివిగా మొక్కలునాటి పచ్చదనం పెంపొందించాలని సూచించారు. గురువారం పట్టణ …

Read More »

సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజెప్పాలి

  కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని ఆ దిశగా అధికారులు శ్రమించాలని ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సంక్షేమ పథకాలపై సమీక్షించారు. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌, తదితర పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని అర్హులైన అందరికి అందేలా చూడాలన్నారు. వాటితోపాటు మ్యూటేషన్‌, వెబ్‌ ల్యాండ్‌, రెవెన్యూ రికార్డుల సవరణ …

Read More »

పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించాలి

  కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలు కెజిబివిఇలు, వసతి గృహాల్లో అన్ని మౌలిక వసతులు త్వరితగతిన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం సర్వశిక్షా అభియాన్‌, ఇంజనీరింగ్‌ సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, వసతి గృహాలకు సంబంధించిన భవనాల నిర్మాణం, గదుల నిర్మాణం, మూత్రశాలలు, మరుగుదొడ్లు ఇతరత్రా పనులు యుద్ద ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్‌ …

Read More »

రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలుపుదాం

  కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపి అగ్రగామిగా నిలుపుకుందామని శాసనమండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయన కామారెడ్డి కలెక్టరేట్‌ కార్యాలయంలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ జిల్లాల పునర్విభజన చేశారన్నారు. దీనివల్ల పాలనా సౌలభ్యంతోపాటు నిధులు అధికంగా విడుదలై జిల్లాలను త్వరితగతిన అభివృద్దికి సాద్యమవుతుందని …

Read More »

రాష్ట్రపతి ఎన్నికపై బిజెపి సంబరాలు

  కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌డిఎ భాగస్వామ్యాలు బలపరిచి రాష్ట్రపతిగా ఎన్నికైన రాంనాథ్‌ కోవింద్‌ భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల కామారెడ్డిలో గురువారం బిజెపి శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఒకరినొకరు మిఠాయిలు పంచుకొని బాణాసంచా కాల్చారు. బిజెపి తెలంగాణ అభివృద్ది కమిటీ ఛైర్మన్‌ మురళీధర్‌గౌడ్‌ మాట్లాడుతూ దళితనేతగా బిజెపి అగ్రనాయకుడుగా, సౌమ్యుడైన రాంనాథ్‌ కోవింద్‌ను అన్ని పార్టీల నాయకులు బలపరిచి రాష్ట్రపతి అభ్యర్థిగా గెలిపించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిద్దిరాములు, …

Read More »

ఏఐఎస్‌ఎఫ్‌ ఆద్వర్యంలో కలెక్టరేట ఎదుట ధర్నా

  కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం కామరెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో ధర్నా నిర్వహించారు. విద్యార్థులతో కలిసి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎప్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భానుప్రసాద్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలలు, వసతి గృహాలను పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ విద్యార్థులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థలను పట్టించుకోకుండా ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యను …

Read More »

పోలీసుల ఆద్వర్యంలో హరితహారం

  బీర్కూర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని తిమ్మాపూర్‌ గ్రామంలో ఎస్‌ఐ రాజ్‌భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు హరితహారం కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులతో కలిసి గ్రామంలో వెయ్యి మొక్కలు నాటారు. చెట్లు నాటి సంరక్షించినపుడే ప్రకృతి సమతుల్యత నెలకొంటుందని ఎస్‌ఐ అన్నారు. ఇంటి పరిసరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద విధిగా మొక్కలు నాటాలని గ్రామ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో కానిస్టేబుళ్లు రాంచందర్‌, పోశన్న, సాయిలు, పెద్దన్న, సురేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »

ప్రతి రైతు వివరాలు పొందుపరచాలి

  బీర్కూర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఆయా గ్రామాల్లోగల రైతుల పంట పొలాల వివరాలను రికార్డులో పొందుపరచాలని తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ అన్నారు సమగ్ర రైతు సర్వేలో భాగంగా అన్నారం గ్రామ శివారులోగల రైతుల వివరాలను గురువారం సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగాచేపట్టిన విత్తన సబ్సిడీలో భాగంగా ప్రతి ఒక్క రైతు వివరాలు పొందుపరచాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Read More »

వృక్షో రక్షతి రక్షిత:

  బీర్కూర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చెట్లను కాపాడితే సమస్త మానవాళిని అవి కాపాడుతాయని బాన్సువాడ రూరల్‌ సిఐ శ్రీనివాస్‌రావు అన్నారు. నసురుల్లాబాద్‌ మండలంలోని మిర్జాపూర్‌ గ్రామంలో గురువారం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటి పెంచితేనే సమస్త మానవాళికి అనేక విధాలుగా ఉపయోగపడతాయని ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటాలని సూచించారు. మిర్జాపూర్‌ గ్రామంలో వెయ్యి మొక్కలను పోలీసుల ఆద్వర్యంలో నాటారు. కార్యక్రమంలో …

Read More »

మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించండి

  బీర్కూర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని తహసీల్దార్‌ కృష్ణానాయక్‌ అన్నారు. బీర్కూర్‌ మండలంలోని అన్నారం గ్రామంలో గురువారం ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు మెను ప్రకారం బోజనం అందిస్తున్నారా లేదా కోడిగుడ్లు అందజేస్తున్నారా లేదా విద్యార్థులను ఏజెన్సీ నిర్వాహకులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. చిన్న వయసులో విద్యార్థులకు పౌష్టికాహారం అందించినపుడే శారీరక, మానసిక ఎదుగుదల సాధ్యమవుతుందని సూచించారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »